Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 11:02 pm IST

Menu &Sections

Search

అభినవ నారద నటుడు శివాజి తెలంగాణా ఏపిలను భారత్-పాక్ గా ట్రీట్ చేస్తున్నారా?

అభినవ నారద నటుడు శివాజి తెలంగాణా ఏపిలను భారత్-పాక్ గా ట్రీట్ చేస్తున్నారా?
అభినవ నారద నటుడు శివాజి తెలంగాణా ఏపిలను భారత్-పాక్ గా ట్రీట్ చేస్తున్నారా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మీడియా చేసిన రాజకీయ కమేడియన్ హీరో ఈ శొంఠినేని శివాజి. అహంభావం అహంకారం నషాళానికి ఎక్కి తైతక్కలాడేలా మాట్లాడే శివాజి మాటలను ఆయన స్వంత సామాజిక వర్గ మీడియా పతాక శీర్షికల్లో కవర్ చేయకపోతే అందులో వార్తే ఉండదు. ఆపరేషన్ గరుడ, ద్రవిడ, కుమార, రాక్షస అంటూ అనేక సినిమా కథలు వినిపించి జనాలకు పిచ్చెక్కించారు. ఈ కథల సీరిస్ తో జనాలకు ఒక ఫాంటసీ స్టోరీని కొనసాగిస్తూవస్తున్నారు. ఆయన వేసిన ప్రతి అడుక్కీ సామాజిక వర్గ మీడియా అత్యధిక ప్రచారం కలిపించింది. 


చివరకు ఆయన ఇప్పుడు డేటా చోరీ కేసుపై శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్న డేటా చోరీకి కారణం తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల సంఘం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2015 లోనే ఓట్ల తొలగింపు ప్రక్రియకు, డేటా చోరీకి తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ తెరలేపారంటూ ధ్వజమెత్తారు.
ap-news-telangana-news-garuda-sivaji-pure-caste-ba
తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు తొలగింపు ప్రక్రియలో కేసీఆర్ ముద్దాయి కాబోతున్నారని, దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర బట్టబయలవుతుందని ఆయన గారి ఆవు కథ
వినిపిస్తూ తటస్థులను సైతం టిడిపికు దూరం చేసే కంకణం కట్టుకున్నారు. ఆందోళనతో టీఆర్ఎస్ పార్టీ ఆ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఐటీ గ్రిడ్ వ్యవహారాన్ని తెర పైకి తెచ్చిందంటూ శివాజీ వ్యాఖ్యానించారు. 
 

సమగ్ర కుటుంబ సర్వే, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఓట్లు తొలగించే హక్కు మీకు ఎవరిచ్చారంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఓట్లు తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చేసిందని ఆరోపించారు. కొంగొత్త కథను పైకి లేపారు ఈ న్యూసెన్స్ నటుడు. డేటా చోర్యం చేసింది తెలంగాణ ప్రభుత్వం అయితే 'దొంగే దొంగ అన్న చందం' గా ఉందన్నారు. దొంగతనం చేసిన కేసీఆర్ ఏపీపై విరుచుకుపడతారా? అంటూ మండిపడ్డారు. కేసీఆర్ హైదరాబాద్ బ్రాండ్ వాల్యూను చంపేశారంటూ విరుచుకుపడ్డారు. 
ap-news-telangana-news-garuda-sivaji-pure-caste-ba
కేసీఆర్ ఏపీని నాశనం చేసేలా, అవమానించేలా వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తాము కేసీఆర్ ను ఎన్నుకున్నామని అలాంటి వ్యక్తి 'ఆంధ్రోళ్లు దొంగలు' అంటూ వ్యాఖ్యానిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ అన్నాన్ని అవమానించారని, బిర్యానీని తిట్టారంటూ విరుచుకుపడ్డారు. ఈయన తెలుగుదేశం ప్రయోజనం కోసం "అన్నం" కేంద్రంగా తెలంగాణా ఆంధ్ర మద్య కొత్త సమరం సృష్టించారు.  తమ బిర్యానీ పేడలా ఉంటుందా? అంటూ హీరో శివాజీ మండి పడ్డారు. తాను ప్రెస్-మీట్ పెట్టేందుకు బయలు దేరుతుంటే తన భార్య తనను పట్టుకుని ఏడ్చిందని, చేతులు పట్టుకుని ప్రెస్-మీట్ పెట్టొద్దంటూ వేడుకుందని చెప్పుకొచ్చారు. అంటే తెలంగాణలో కేసీఆర్ ను చూసి భయపడాలా? అంటూ విరుచుకుపడ్డారు. లక్షల మంది ఆంధ్రులం భయంలేకుండా తెలంగాణాలో బ్రతికేస్తున్నాం. వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మాకేం కానిది, శొంటినేని శివాజికి  ఎమౌతుందని  అంటున్నారు మిత్రులు. పాపం ఆయన నోటి దూలకు సరిహద్దులుండవు కదా! అందుకే ఆయన శ్రీమతి ప్రెస్-మీట్ వద్దని అని ఉండవచ్చు.  తాము ఓటేసి ఎన్ను కున్న వ్యక్తి కేసీఆర్ అని, ఒక ప్రజా ప్రతినిధిగా తమను ఇలా బెదిరిస్తారా? తమాషాలు చేస్తారా? అంటూ చరిత్ర వినిపిస్తూ విరుచుకుపడ్డారు. మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా విరుచుకుపడ్డారు హీరో శివాజీ. కారణం ఆయన తెలుగుదేశానికి తీవ్ర అభిమాని కదా! 
ap-news-telangana-news-garuda-sivaji-pure-caste-ba
హైదరాబాద్ రావడానికి ఆంధ్ర పోలీసులకు హక్కు ఎక్కడిది అంటూ నిలదీయడాన్ని మండిపడ్డారు. హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధాని అని అలాంటిది ఏపీ పొలీసు లు రావొచ్చన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్ను అడ్డుకోవడానికి కేటీఆర్ ఎవరంటూ ధ్వజమెత్తారు సినీనటుడు శివాజీ.  అయితే  శివాజి మరచిపోయిన విషయం - రాత్రికి రాత్రే బిచాణా చుట్టేసి ఆంధ్ర ముఖ్యమంత్రి సరంజామాతో మందీమార్భలం తో హైదరాబాద్ నుండి అమరావతి పారిపోయారు. ఇంకేం ఉమ్మడి రాజధాని? అయినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణాకు పాకిస్తాన్ కాదు. శొంటినేని శివాజి లాంటి తెలుగుదేశం పార్టీ దురభిమానులు ఉన్నంతవరకు అలాంటి భావనల ప్రచారం జరుగు తూనే ఉంటుంది. 

సాధారణ మనలాంటి వారకు భారత్ వన్ - భారత్ లో ఎవరు ఎక్కడికైనా పోవచ్చు. గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర నిఘా సంస్థల ప్రవేశాన్ని ఏపిలోకి నిషేధించింది. ఇప్పుడు శివాజి ప్రేరణతో "తెలంగాణా పోలీసులకు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశం నిషేధం విధిస్తారేమో? ఇప్పుడు చంద్రబాబు"   
ap-news-telangana-news-garuda-sivaji-pure-caste-ba
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దేశ రక్షణతో రాజకీయాలు చేస్తున్న యుపి సమాజ్ వాదీ పార్టీ నాయకుడు రాం గోపాల్ యాదవ్-
సుమలత కన్నడనాట ఎన్నికల్లో గెలిస్తే ఇండిపెండెంట్ గా రికార్డే!
ఉత్తరప్రదేశ్ ను గెలిచేవాడే డిల్లీకి చక్రవర్తి
అప్పుడే వివాదసుడిలో ప్రియాంక గాంధి
మనోహర్ పారికర్ విశ్వవిజేత ఎలా అయ్యారో తెలుసా! ఒక షాకింగ్ ఉదాహరణ!
ఎడిటోరియల్: చంద్రబాబును ఏవరూ ఓడించ లేరు - ఆ ఒక్కటి తప్ప
షాకింగ్ న్యూస్: డికే అరుణ బిజేపిలోకి! కాంగ్రెస్ బుట్ట తెలంగాణా దులిపేస్తుందా!
వివేకా హత్యకు ముందు కుక్క హత్య - అజ్ఞాతవ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్! నిందితులు దొరికినట్లే?
షాకింగ్: పికె సున్నితంగా కొట్తిన దెబ్బ చంద్రబాబు నవనాడులపై తగిలినట్లే? నోటి దూలకు..?
శృంగార దీవిలో ఆంభోది మద్యలో శృంగార రసకేళీ విలాసం
ప్రియాంక గాంధీ వాధ్రా హనుమాన్ ఆలయంలో పూజలు..గంగలో పడవ ప్రయాణం ఎన్నికల జిమ్మిక్స్
మరో ప్రఖ్యాత చానల్ టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే: ఏపిలో వైసిపి ప్రభంజనం
లోకెష్ కోసం మంగళగిరిలో బలహీన అభ్యర్ధిని నిలిపితే పవన్ కళ్యాన్ చరిత్ర హీనుడుగా మిగలటం గ్యారంటీ
"మేం కాదు చంద్రబాబే మా కింద పనిచేశారు-మేమే సీనియర్లం" వదరు బోతుకు సరైన సమాధానం సంచలనం
పాక్ అణ్వా యుధ కర్మాగారంలో ఏం జరుగుతుంది? అంతా అనుమానాస్పదమే!
రాజకీయాల్లో సామాన్యుడు ప్రజలకు మనోహరుడు పారికర్ కన్నుమూశారు
ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత-భారత ఫైటర్ జెట్స్ మోహరింపు-మాయమైన పాక్ నేవీ
సర్జికల్ స్ట్రైక్స్-2 తరవాత భారత్-పాక్ మద్య అణుయుద్ధం దాడిని అడ్డుకొన్న అమెరికా!
జనసేన లో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ
“మీ భవిష్యత్తు నా బాధ్యత” అనే బాబు మాటలో విశ్వాసం ఏంత? ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారుల అభిప్రాయం
About the author