క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతోంది. ఐటి గ్రిడ్ సాఫ్ట్ వేర్  వ్యవహారాలు వెలుగు చూస్తుంటే ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అండతోనే గ్రిడ్ సంస్ధ ఛైర్మన్ అశోక్ రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఐటిశాఖ మంత్రిగా లోకేష్ నిర్వహించే సమీక్షా సమావేశాల్లో అశోక్ కూడా పాల్గొనేవాడని సమాచారం. కొన్నిసార్లు నేరుగా అశోకే సమీక్ష నిర్వహించారని కూడా ఆరోపణలు వినబడుతున్నాయి.

 

అందుతున్న సమాచారం బట్టే లోకేష్ తో అశోక్ కున్న సంబంధాలు అర్ధమవుతున్నాయి. మరి అంతటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటే అర్ధమేంటి అశోక్ వెనుక లోకేష్ పూర్తి సహకారం ఉన్నట్లే కదా ? అందుకనే అందరి చూపులు ఇపుడు లోకేష్ వైపే చూస్తున్నాయి. లోకేష్ అండదండలు పూర్తిగా ఉన్నాయి కాబట్టే వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని కూడా ఐటి గ్రిడ్స్ కంపెనీకి అందించాలని ప్రభుత్వం కూడా ఆదేశాలిచ్చినట్ల సమాచారం.

 

మొత్తం వ్యవహారంలో లోకేష్ పాత్రేంటో బయటపడాలంటే ముందుగా అశోక్ దొరకాలి. అంటే అశోక్ దొరికితే లోకేష్ సంగతి గోవిందానే. అందుకనే సంస్ధ ఛైర్మన్ ను టిడిపిలోని ముఖ్యనేతలు అంత జాగ్రత్తగా దాచిపెట్టారనే ఆరోపణలు వినబడుతున్నాయి. సిట్ కు నేతృత్వం వహిస్తున్న స్టీఫెన్ రవీంద్ర కూడా అశోక్ ఏపిలోనే ఎక్కడో దాక్కున్నట్లే అనుమానిస్తున్నారు.

 

చంద్రబాబు అండ్ కో చెబుతున్నట్లు ఐటి గ్రిడ్స్ కంపెనీ కేవలం టిడిపి కార్యక్రమాలను అప్ డేట్ చేస్తున్నది మాత్రమే నిజమైతే కంపెనీ ఛైర్మన్ ఎందుకు పరారీలో ఉన్నారు. పోలీసుల విచారణకు ధైర్యంగా సహకరించవచ్చు కదా ? అశోక్ పరారీలో ఉన్నారు కాబట్టే ఎవరు చంద్రబాబు అండ్ కో మాటలను నమ్మటం లేదు. కచ్చితంగా ప్రభుత్వం నుండే ఐటి గ్రిగ్స్ కంపెనీకి 3.5 కోట్లమంది జనాల వ్యక్తిగత వివరాలు అందాయనే నమ్ముతున్నారు.

 

జగన్ అండ్ కో ఆరోపణలే నిజమనటానికి సంస్ధ ఛైర్మన్ పరారీలో ఉన్నదే రుజువు. పోలీసుల ముందుకు వచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన ఛైర్మన్ పరారీలో ఉన్నారంటేనే మోటివ్ అర్ధమైపోతోంది. ఎన్నికలు ముంచుకువస్తున్న నేపధ్యంలో డేటా చోరీ స్కాం బయటపడటంతోనే చంద్రబాబు, చినబాబుకు చెమటలు పడుతున్నాయి. అందుకనే అశోక్ కు షెల్టర్ ఇచ్చారనే ఆరోపణలు వినబడుతున్నా దానిగురించి స్పందించటం లేదు. ఎన్ని రోజులు అశోక్ పోలీసుల నుండి తప్పించుకుంటారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: