డేటా చోరీ స్కాం బయటపడిన వారం రోజుల తర్వాత డాకవరపు అశోక్ బయటకు వచ్చారు. బయటకు వచ్చారంటే కోర్టులో పిటీషన్ వేశారులేండి. స్కాంతో తనకు ఏమీ సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అంతకన్నా ఏం చెబుతారు ? స్కాంలో తాను కీలక పాత్ర పోషించినట్లు చెబుతారని ఎవరూ అనుకోవటం కూడా లేదు. డేటా చోరీ స్కాంకు సంబంధించి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ అశొక్ తన పిటీషన్లో కోర్టును కోరారు.

 

పిటీషన్ వేయటమేముంది ? అశోక్ తరపున ఎవరో లాయర్ కేసు దాఖలు చేస్తారు. కానీ ఆయన వేసిన పిటీషన్ ను కోర్టు సోమవారం విచారణ చేయబోతోంది. అప్పటికి అశోక్ కచ్చితంగా కోర్టులో హాజరు కావాల్సుంది. కోర్టుకు హాజరైనపుడు పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే, ఇప్పటికే అశోక్ కోసం పోలీసులు లుకవుట్ నోటీసు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

అసలు స్కాం బయటకు వచ్చిన వారం రోజుల తర్వాత కోర్టులో పిటీషన్ వేసిన అశోక్ ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారో ముందు తేలాలి. ఎవరి షెల్టర్లో ఉన్నారు ? స్కాంకు సూత్రదారి ఎవరు ? డేటాను ఉపయోగించుకున్న విధానాలు లాంటి విషయాలపై స్పష్టత ఇవ్వాల్సుంటుంది. సరిగ్గా ఎన్నికలకు ముందు డేటా చోరీ స్కాం బయటపడటం తెలుగుదేశంపార్టీకి పెద్ద సమస్యగా మారింది. మరి పోలీసులకు పట్టుబడిన తర్వాత అశోక్ ఏమి చెబుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: