తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు నారా లోకెష్ భీమునిపట్నం నుంచి పోటీ చేయడానికి దాదాపుగా నిర్ణయం జరిగిపోయింది. దీని మీద అధికారిక ప్రకటన రావడమే ఇక తరువాయి. లోకేష్ తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన కొసం సేఫ్ జోన్ అంటూ ఇన్నాళ్ళూ రాష్ట్రమంతా గాలించిన టీడీపీకి ఇపుడు భీమిలీ దొరికేసింది.


ఆదే ఫలితమా :


సరిగా అయిదేళ్ళ క్రితం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేశారు. నాడు వైసీపీ మంచి స్వింగ్ లో ఉంది. ఆమె మీద పోటీకి తెచ్చింది బీజేపీ అభ్యర్ధిని. దాంతో విజయమ్మ గెలుపు సునాయాసం అనుకున్నారు. కానీ సరిగ్గా ఇక్కడే ఓ వ్యూహాన్ని టీడీపీ అమలుపరచింది. నాన్ లోకల్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. పైగా కడప బాంబులతో విరుచుకుపడతారు, ప్రశాంత విశాఖ అల్లకల్లోలం అయిపోతుందని కూడా భయపెట్టారు. సీమ నేతలకు ఉత్తరాంధ్రాతో  ఏం పని అంటూ కూడా నిలదీశారు. మరిపుడు సీమ నేత లోకెష్ భీమిలీలో పోటీకి వస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందన్నది చర్చగా ఉంది.


వైసీపీ ఊరుకుంటుందా :


నాడు తమపైన  పగ పట్టి మరీ విజయమ్మను ఓడించిన టీడీపీకి ఇపుడు గుణపాఠం చెప్పడానికి చాన్స్ వైసీపీకి వస్తోంది. లోకేష్ కనుక పోటీకి దిగితే వైసీపీ కూడా టీడీపీ దారిలోనే నాన్ లోకల్ ప్రచారం ముందుకు తేవడం ఖాయం. అంతే కాదు సీమ నేతలకు ఇక్కడ పనేంటి అంటూ లోకెష్ మీద అటాక్ చేయడమూ జరుగుతుంది. ఇక ప్రశాంత భీమిలీలో అశాంతి రాజకీయం కూడా మొదలవుతుందని భయపెట్టడ‌మూ ష్యూర్. భీమిలీ టీడీపీకి కంచుకోట అనుకుంటున్నారు.


కానీ ఇక్కడ రెండు మార్లు వరసగా ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు జనం. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. పైగా ఇక్కడ జనం స్థానికులనే గెలిపించడం ఆనవాయితీ. దిగుమతి సరుకులు వస్తే తిప్పి కొడతారని కూడా అంటున్నారు. లోకెష్ తో పోటీ పడుతున్న వైసెపీ అభ్యర్ధి అవంతి శ్రీనివాసరావు తక్కువ క్యాండిడేట్ ఏమీ కాదు, ఆయనకు అంగబలం, అర్ధబలం పూర్తిగా ఉన్నాయి. పైగా బలపైన కాపు సామాజిక వర్గం వెంట ఉంది. అందువల్ల లోకేష్ గెలుపు నల్లేరు మీద నడక కాదు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: