నారా లోకేశ్.. తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2. చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టేది ఈయనే అన్న సంగతి తెలిసిందే. కానీ పాపం లోకేశ్ ను ఐదు విషయాలు ఇబ్బంది పెడుతున్నాయి. రాజకీయంగా ఆయన ఎదుగుదలను అవరోధంగా మారుతున్నాయి. అవేంటో చూద్దాం..

 


1. వారసత్వం. లోకేశ్ జనం నుంచి వచ్చిన నేత కానే కాదు. ఆయన కేవలం చంద్రబాబు కొడుకు కావడం వల్లనే రాకీయాల్లో ఈ స్థాయిలో ఉన్నాడు. మంత్రి పదవి కూడా చంద్రబాబు కొడుకు కావడం వల్లనే వచ్చింది. ఈ విషయంపై ప్రత్యర్థులు నిరంతరం ఆరోపణలు చేసే అవకాశం ఉంటోంది.

 nara lokesh hd images కోసం చిత్ర ఫలితం


2. వాగ్దాటి లోపం. ఓ రాజకీయ నాయకుడికి ఇది చాలా అవసరం. కానీ లోకేశ్ లో మంచి వాగ్దాటి లేనే లేదు. మంచి వాగ్దాటి లేకపోగా.. మనసులో ఒకటి అనుకుని స్టేజ్ పైకి వచ్చాక మరొకటి చెప్పేస్తుంటారు. సొంత పార్టీని కూడా కులగజ్జి పార్టీ అంటూ తిట్టిన చరిత్ర లోకేశ్ కు ఉంది. ఈ లోపం ప్రత్యర్థుల్లో లోకేశ్ ను చాలా చులకన చేస్తోంది.

 à°¸à°‚బంధిత చిత్రం


3. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్న అనుభవం లేకపోవడం లోకేశ్ కు పెద్ద మైనస్ అవుతోంది. ఓ రాజకీయ నాయకుడు నిరూపించుకునేది ఈ ప్రత్యక్ష రాజకీయాల ద్వారానే. అలా కాకుండా లోకేశ్ ఎమ్మెల్సీ అనే అడ్డదారిలో మంత్రి కావడం ఓ పెద్ద మైనస్ పాయింట్ గా మారింది.

సంబంధిత చిత్రం


4. ఇప్పటి వరకూ లోకేశ్ తన సత్తా నిరూపించుకోకపోవడం కూడా మరో పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవాలి. అంతకుముందు హైదరాబాద్ ఎన్నికలను పర్యవేక్షించినా సున్నా ఫలితాలు వచ్చాయి. ఏపీలో కూడా సొంతంగా ఏదీ సాధించలేకపోయారు.

 à°¸à°‚బంధిత చిత్రం


5. కోటరీపై ఆధారపడి ఉండటం. లోకేశ్ స్వతహాగా దూసుకుపోయే తత్వం కాదు. సొంత ఆలోచనతో ఏదైనా చేసే తత్వం కూడా కాదు. ఆయనకంటూ ఓ కోటరీ ఉంది. వారి ప్రోత్బబలం తోనే ఆయన ముందుకు సాగుతాడు. ఓ నాయకుడికి సొంత ఐడియా ఉండాలి. రాజకీయ వ్యూహాల్లో ఇది చాలా అవసరం. ఈ ఐదు లోపాలు లోకేశ్ ను ఇబ్బంది పెడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: