ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఒక్కటే న్యూస్ డేటా చోరీ.   టీడీపీ డేటాను దొంగిలించిన వారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సమాచారాన్ని చోరీ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుందని దుయ్యబట్టారు.  ఎలక్షన్ మిషన్ - 2019లో భాగంగా ఆయన అమరావతిలో పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... సాధికార మిత్రలపై ఫిర్యాదు చేయడం ద్వారా పేదలకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారన్నారు.

దారుణమైన విషయం ఏంటేంట..మంత్రి ఫరూక్ వంటి సీనియర్ల ఓట్లను సైతం తొలగించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన ఓ సాక్ష్యం తన వద్దకు చేరిందని, మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ సాక్ష్యాన్ని బయటపెడతానని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్త ప్రచారం, బహిరంగ సభలపై దృష్టిని సారిస్తామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే..  ప్రజల ప్రాణ-ఆస్తులకు రక్షణ ఉంటుందా అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణకు ఏపీ కలకలం ఊడిగం చేయాలని చెబుతున్న కేసీఆర్‌కు జగన్ సహకరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.  

టికెట్లు ఖరారైన అభ్యర్థులంతా విస్తృతంగా ప్రజల్లో తిరగాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ రాష్ట్రం నుంచి రూ. 11,278 కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి వున్నాయని, వాటి వసూలుకు అధికారులు కృషి చేస్తారని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: