నెల్లూరు వైసిపి ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు ఉన్నతాధికారులను బెదిరించారనేది ఎంఎల్ఏపై పోలీసులు పెట్టిన కేసు. ఎందుకు బెదిరించారో, ఎక్కడ బెదిరించారో మాత్రం పోలీసులెవరూ చెప్పటం లేదు.  ఎన్నికల షెడ్యూల్ రిలీజయ్యే ముందు వైసిపి ఎంఎల్ఏలు, నేతలు, కార్యకర్తల అరెస్టుకు తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకున్నట్లే కనబడుతోంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, వైసిపి సానుభూతిపరుల ఓట్లను టిడిపి తీయించేస్తోందనే వివాదం అందరికీ తెలిసిందే. ఐటి గ్రిడ్స్ కంపెనీకి రాష్ట్రంలోని 3.5 కోట్లమంది ప్రజల వ్యక్తిగత వివరాలను గ్రిడ్స్ కంపెనీకి చంద్రబాబునాయుడు కట్టబెట్టారనేది ప్రధానమైన ఆరోపణ. ఆ విషయంలోనే రెండు రాష్ట్రాల మధ్య ప్రకంపనలు పెరిగిపోతున్నాయి.

 

ఈ నేపధ్యంలోనే రెండు రోజుల క్రితం నెల్లూరులో కొందరు యువకులు ఇంటింటి సర్వే పేరుతో నగరంలో తిరగటం సంచలనంగా మారింది. విషయం ఆనోటా ఈ నోట వైసిపి నేతలకు చేరింది. దాంతో వైసిపి నేతలు వెళ్ళి యువకులను పట్టుకుని పోలీసులకు అప్పిగించారు. యువకులను వైసిపి నేతలు పట్టుకోవటం పెద్ద వివాదానికి దారితీసింది. ఆ విషయంగానే పార్టీ కార్యాలయంలో ఉన్న ఎంఎల్ఏ కోటంరెడ్డిని పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. దాంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. మరి ఇంకెతమందిని పోలీసులు అరెస్టులు చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: