గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో డేటా చోర్యం కేసు పై పెద్ద యుద్దమే కొనసాగుతుంది.  ఏపీ, తెలంగాణ మధ్య రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన డేటా చోరీ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. 

— ఈ వ్యవహారంలో ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు వేగవంతం చేసిన విషయం తెలిసిందే. టీ గ్రిడ్స్‌ సంస్థపై గత కొంతకాలంగా జరుపుతున్న విచారణను నిలిపివేయాలని, కేసును కొట్టివేయాలని ఈ మేరకు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. -

తెలుగుదేశం పార్టీకి చెందిన సమాచారాన్ని చోరీ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుందని, అది ఆదిలోనే గంగపాలైందని ఆయన అన్నారు. 

వైసీపీ దొంగల ముఠా వదిలేసిన ఓ సాక్ష్యం తన వద్దకు చేరిందని, మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ సాక్ష్యాన్ని బయటపెడతానని వెల్లడించారు. 

  మీడియా మొత్తం చంద్రబాబు మీటింగ్ పై దృష్టి కేంద్రీకరించారు..ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన ఆయన, మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇక ప్రచారం, రాష్ట్రవ్యాప్త ప్రచారం, బహిరంగ సభలపై దృష్టిని సారిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ కోసం సిద్దం అవుతున్న నేపథ్యంలో.. ఉన్నట్టుండి తన ప్రెస్ మీట్ రద్దు చేసినట్లు సమాచారం.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: