అనంత పురంలో ఇప్పటికే చంద్ర బాబు టికెట్స్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. జేసి ఫ్యామిలీ వారసులకు ఇద్దరికీ టికెట్స్ బాబు కేటాయించాడు.ఈ వ్యవహారంలోకి ఆఖరి నిమిషంలో కొత్త వాదనతో ఎంట్రీ ఇచ్చారు మంత్రి పరిటాల సునీత. ఈసారి ఎన్నికల్లో తన తనయుడు శ్రీరామ్ ను పోటీచేయించాలి అనేది సునీత ఆలోచన. అంటే తను తప్పుకుని.. సీటు వదులుకుని.. తనయుడికి అవకాశం ఇవ్వడం కాదు. తన సీటు తనకు దక్కాల్సిందే, శ్రీరామ్ కు మరో సీటు కావాలి.. అనేది వారి కోరిక.

Image result for paritala suneetha

అందుకోసం పలు సీట్ల పేర్లను స్వయంగా సునీతే చెప్పారట. హిందూపురం ఎంపీ కానీ, ధర్మవరం, పెనుకొండ , అనంతపురం అసెంబ్లీ సీట్లలో ఏదో ఒకటి తన కుమారుడికి కేటాయించాలని చంద్రబాబుపై చాన్నాళ్లుగా ఆమె ఒత్తిడి తీసుకు వస్తూ ఉన్నారు. అయితే.. బాబు మాత్రం నో చెబుతూ వచ్చారు. ఒక కుటుంబానికి ఒకటే టికెట్ ఫార్ములా అంటూ బాబు తప్పించుకొంటున్నారు. అయితే.. ఇప్పుడు జేసీ కుటుంబానికి రెండు టికెట్లను బాబు ఖరారు చేశారు.

జేసీ కుటుంబానికేనా.. మాకివ్వరా?: పరిటాల అలక!

అందునా వారసులకు అవకాశం ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో.. ఐదేళ్ల కిందట పార్టీలోకి వచ్చిన జేసీ వారసులకు అవకాశం ఇస్తూ.. పార్టీ కోసం ఎంతో కోల్పోయిన తమ వారసులకు మాత్రం అవకాశం ఇవ్వరా? అని సునీత ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. తన తనయుడికి అవకాశం ఇవ్వాల్సిందే అని, కల్యాణదుర్గం ఎమ్మెల్యే టికెట్ అయినా కేటాయించాల్సిందే అని సునీత పట్టుబడుతున్నారని సమాచారం. మరి జేసీ వారసులకు దొరికినంత ప్రాధాన్యత.. పరిటాల వారసుడికి దొరుకుతుందో లేదో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: