త్వరలో దేశమంతటా పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ని ఎలాగైనా గద్దె దించడానికి దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు.

Image result for Rahul gandhi

ఈ క్రమంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మరియు బి.జె.పి పార్టీలు కాక కొత్త కూటమి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరిగిన కెసిఆర్ పై మరియు మోడీపై సంచలన కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్.

Image result for Rahul gandhi

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రదాని మోడీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని ఎఐసిసి అధినేత రాహుల్ గాందీ విమర్శించారు.శంషాబాద్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.నోట్ల రద్దు జరిగితే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ‘శభాష్‌’ అంటారు. జీఎస్‌టీ పేరుతో చిరు వ్యాపారులపై 5 రకాల పన్నులు వేస్తుంటే మంచి పని చేశారని కేసీఆర్‌ అంటారు.

Related image

లోక్‌సభ, రాజ్యసభల్లో మోదీ ఏ దుర్మార్గానికి పాల్పడినా కేసీఆర్‌ మద్దతు తెలిపారు. కేసీఆర్‌ రఫేల్‌ విషయంలో ఎన్నిసార్లు ప్రశ్నించారు..? మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా రూ.30వేల కోట్ల దోపిడీపై దర్యాప్తు జరగాలని కోరారా..? లేదు..! ఎందుకంటే, కేసీఆర్‌ అవినీతి మొత్తం మోదీకి తెలుసు. మోదీ చేతిలో కేసీఆర్‌ రిమోట్‌ ఉంది. అందుకే కేసీఆర్‌ మోదీని ప్రశ్నించరని రాహుల్ ఆరోపించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: