ఏపీలో పురుడుపోసుకున్న డేటా వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ప్రజల డేటాను వేటు కంపెనీలకు అందించి.. ఆ విషయం లోకానికి తెలియడంతో తప్పు కప్పి పుచ్చుకునేందుకు నానా రచ్చ చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 à°¸à°‚బంధిత చిత్రం


ఆయన ప్రధానంగా ఈ ఐదు ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిఉంది. అవి.

1. ప్రభుత్వానికి పార్టీకి ఉండవలసిన తేడాను పట్టించుకోకుండా, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పార్టీ యదేచ్చగా వాడుకోవడం, ఒక ఐటి గ్రిడ్స్ అనే ప్రైవేటు సంస్థకు దానిని అందచేయడం నిజం కాదా..?

 

2. ఒక ప్రైవేటు కంపెనీపై పోలీసులు దాడి చేసి సోదాలు చేస్తే ఒక ముఖ్యమంత్రి కంగారు పడవలసిన పరిస్థితి ఏమి ఉంటుంది? తెలుగుదేశం కు ఆ కంపెనీ సేవలు అందించిందని, యాప్ రూపొందించిందని చెప్పారు. అంతవరకు అభ్యంతరం లేదు. కాని ఆ యాప్ ద్వారా అదికార దుర్వినియోగం చేస్తున్నారా? లేదా ?

chandrababu data war కోసం చిత్ర ఫలితం



3. ఏపీలో భద్రంగా,రహస్యంగా ఉంచవలసిన సమాచారాన్ని ఆ కంపెనీకి అప్పగించారా? లేదా  ? అధికారికంగా ఆ సమాచారం ఇచ్చినట్లు ఎందుకు చంద్రబాబు చెప్పలేకపోతున్నారు.?

 

4. హైదరాబాద్ లో ఐటి గ్రిడ్స్ ఉద్యోగి మిస్ అయ్యారని అంటూ గుంటూరులో పిర్యాదు చేయడం ఏమిటి ? అక్కడ నుంచి ఆగమేఘాల మీద ఎపి పోలీసు టీమ్ లను హైదరాబాద్ పంపించడం ఏమిటి?

chandrababu data war కోసం చిత్ర ఫలితం



5.  ఎందుకు చంద్రబాబు కాని, లోకేష్ కాని భయపడుతున్నారు?తెలంగాణ పోలీసులు స్పష్టంగా ఆ ఐటి గ్రిడ్స్ సంస్థ ఉద్యోగులు తమ అదుపులో ఉన్నారని చెప్పినా, హెబియస్ కార్పస్ పిటిషన్ ఎందుకు వేయించారు? పైగా ఆ సంస్థపై పిర్యాదు చేసిన లోకే్శర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేయడానికి ఎపి పోలీసులు ఎందుకు ప్రయత్నించారు?


మరింత సమాచారం తెలుసుకోండి: