ఏపీలో రాజకీయం బాగా వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో తాము ఏం చేస్తామో చెప్పాల్సిన పార్టీలు ఇప్పుడు ఆ విషయాలను వదిలేసి.. ఫారమ్ 7 వివాదం, డాటా చోరీ వివాదం వంటి విషయాలపై ఆరోపణలు చేసుకుంటున్నాయి. అసలు ఇంతకీ ఈ ఫారమ్ 7 ఏంటి.. దీని ద్వారా ఇంత గందరగోళం ఎందుకు తలెత్తింది.. ఓసారి పరిశీలిద్దాం..

 à°¸à°‚బంధిత చిత్రం


అసలు ఫారమ్ 7 ఏంటి.. దీన్ని ఎందుకు వాడతారు.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగిఉండటం ఎంత ముఖ్యమో.. దొంగ ఓట్లు లేకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. అలా దొంగ ఓట్లను నిరోధించడానికి ఎన్నికల సంఘం కల్పించిన సౌకర్యమే ఫారమ్ 7. ఈ ఫారమ్ ద్వారా ఎవరి దొంగఓట్ల నైనా తొలగించవచ్చు.

No photo description available.


మనకు ఫలానా వారి ఓటు దొంగ ఓటు అని అనుమానంగా ఉంటే.. సదరు ఓటరు ఇక్కడ లేకపోయినా ఓటు పొంది ఉంటే.. ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగిఉంటే.. ఆ వివరాలు పొందుపరుస్తూ ఆన్ లైన్‌లో ఈ ఫారమ్ 7 దాఖలు చేయవచ్చు. అయితే ఫారమ్ 7 దాఖలు చేయగానే ఓటు తొలగిపోదు.  దీన్ని ఎన్నికల సంఘం పూర్తిగా పరిశీలిస్తుంది. తనిఖీ నిర్వహించి ఆ ఆరోపణ నిజమని నిర్థారణ అయితేనే ఆ ఓటును తొలగిస్తుంది.

ఫారమ్ 7 కోసం చిత్ర ఫలితం


ఏపీలో తెలుగుదేశం లక్షల సంఖ్యలో దొంగఓట్లు నమోదు చేయించిందని.. అందుకే తాము ఫారమ్ 7 ద్వారా వాటిని తొలగించేందుకు దరఖాస్తు  చేశామని జగన్ ఓ సభలో ప్రకటించారు. దీన్ని ఇప్పుడు తప్పుడు ప్రచారం ద్వారా తెలుగుదేశం వాడుకుంటోంది. జగన్ మీ ఓట్లన్నీ తొలగిస్తున్నాడని ప్రచారం చేస్తోంది. ఐతే.. ఏపీలో ఈ ఫారమ్ 7 దరఖాస్తులు లక్షల సంఖ్యలో వస్తున్నాయని ఈసీ చెబుతోంది. మరి ఈ దరఖాస్తులన్నీ ఎవరు పెడుతున్నారు అన్న విషయం దర్యాప్తు తర్వాత కానీ తెలియదు.


మరింత సమాచారం తెలుసుకోండి: