డాటా స్కామ్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే హాట్ టాపిక్. ఈ కేసులో అసలు సిసలు సూత్రధారి ఐటీ గ్రిడ్స్ సంస్థ యజమాని దాకవరం అశోక్ మాత్రం పరారీలో ఉన్నాడు. ఆయన తెలుగుదేశం నేతల, ఏపీ మంత్రుల పర్యవేక్షణలోనే ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. ఐతే.. ఈ దాకవరం అశోక్ పూర్వాపరాలు పరిశీలిస్తే.. ఆయన ఏపీ మంత్రి లోకేశ్‌ కు బినామీ అంటూ ఓ ప్రముఖ పత్రిక వివరాలు వెల్లడించింది.

it grids ashok కోసం చిత్ర ఫలితం 


ఆ వివరాలు ప్రకారం.. దాకవరం అశోక్.. ప్రకాశం జిల్లా కావలి నియోజకవర్గంలోని అల్లూరు గ్రామానికి చెందినవాడు.  అశోక్‌ తండ్రి బుజ్జయ్య చిన్నపాటి ఉప్పు రైతు. కుటుంబ పోషణ, ఉప్పు సాగుతో అప్పులపాలైన బుజ్జయ్య వాటిని తీర్చలేక చేతులెత్తేసాడు. కర్ణాటకలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన అశోక్‌.. టీడీపీ నేతలు బీదా బ్రదర్స్‌కు దగ్గరయ్యాడు. మాజీ ఎమ్మెల్యే, అమరావతి రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యుడు బీదా మస్తాన్‌రావు, అతని సోదరుడు ఎమ్మెల్సీ, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీదా రవిచంద్రలతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నాడు.

it grids ashok కోసం చిత్ర ఫలితం


రాజకీయ నాయకులకు సర్వేలు చేయిస్తానంటూ డబ్బు సంపాదన ప్రార్ంభించాడు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.పార్టీ అనలిస్ట్‌ డాట్‌ కామ్‌ను స్థాపించాడు. ఆ తర్వాత ఆ సంస్థను ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌గా మార్చాడు. బీదా బ్రదర్స్‌ ద్వారా లోకేశ్‌తో పరియం ఏర్పరుచుకున్న అశోక్‌.. ఆ తర్వాత వేమూరి హరిప్రసాద్‌ ద్వారా మరింత దగ్గరయ్యాడట.

సంబంధిత చిత్రం



టీడీపీ సేవామిత్ర యాప్‌కు రూపకల్పన సమయంలో లోకేశ్‌ తొలివిడతగా రూ.8 కోట్లు డబ్బులు పెట్టుబడిగా పెట్టి అశోక్‌ను  బినామీ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఐటీ గ్రిడ్స్ సంస్థ విలువ  రూ.65 కోట్లు ఉంటుందట. అశోక్ దాదాపు 40 ఎకరాలు భూమి కొన్నాడట. తూర్పుగోగులపల్లిలో 100 సీజేఎఫ్‌ఎస్‌ రొయ్యల గుంటల సాగు ఎలా చేస్తున్నాడట? ఇవన్నీ మంత్రి లోకేశ్ బినామీ ఆస్తులేనని సదరు పత్రిక చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: