నేరాభియోగాలున్న వ్యక్తులను, సంస్థలను వెనకేసుకొని రావటం, వాళ్ళ పై కేంద్రం గాని, పొరుగు రాష్ట్రాలు గాని విచారణ సంస్థలను పంపించి విచారణ జరపాలనుకుంటే, ఏపిలో ఆ సంస్థల ప్రవేశాన్నే నిషేదిస్తారు. అంతే కాదు నేరాభియోగాలున్న వారిపై దాడులను - ఏపి ప్రజలపై కేంద్రమో?  తెలంగాణానో? దాడి చేస్తున్నాయని ప్రచారం చేయటం చూస్తుంటే అంతర్జాతీయ నేరాభియోగాలు మోపబడిన వాళ్ళను, సమాచార చోరులను, దగా కోరులను, అవినీతి పరులను, ఇసుక మాఫియా గాళ్ళను, ప్రభుత్వోధ్యోగులపై దాడి చెసేవాళ్ళను, మహిళలపై లైంగిక దోపిడీ గాళ్ళను, భూకబ్జా గాళ్ళను ఇలా లెక్కకు మిక్కిలి నేరగాళ్ళను కాపాడుకుంటూ వచ్చే రాష్ట్రం ఒకే ఒక్కటే ఉంది అదే ఆంధ్రప్రదేశ్ అంటున్నారు ఇతర రాష్ట్రాలవారు.   
Image result for buggana about chandrababu & lokesh
అంతేకాదు ప్రజలు తనను తన నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ అనుభవం చూసి ఎన్నుకొని తమ సంక్షెమం అభ్హివృద్ది చూడమని కోరితే ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల ను తనచుట్టూ వలయంగా ఏర్పడి తనను, తను కాపాడుకుంటూ వస్తున్న ముద్ధాయిలను చుట్టూవలయంగా ఏర్పడి కంటికి రెప్పలా కాపాడమనటం న్యాయమా? అంటు న్నారు ప్రజలు.
Image result for buggana about chandrababu & lokesh
ఆయన ఎవరో ఈ దేశం చెప్పకుండానే అర్ధం చేసుకోగలదు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సమాచార చౌర్యం కేసులో ఏదో కొత్త విషయం చెబుతారని అంతా ఎదురుచూస్తే తుస్సుమని అనిపించారని, సెల్ప్-గోల్ వేసుకున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. టిడిపి డేటా పోయిందని దాని గురించి ఆదారాలను చంద్రబాబు బయట పెడతారంటూ టిడిపి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసిందని, తీరా చూస్తే ఆయన కొత్త విషయం ఒక్కటి కూడా చెప్ప లేదని, దాంతో టిడిపి మీడియాకే తీవ్ర నిరుత్సాహం కలిగిందని ఆయన ఎద్దేవ చేశారు. 
Image result for chandrababu supports dakavarapu ashok
పైగా రాజధానిపై పదేళ్ల హక్కు ఉన్నా, తాను రాజీపడ్డానని, చంద్రబాబు వెల్లడించారని ఆయన అన్నారు. దీనివల్ల ఎంతో మంది ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఆయనఅన్నారు. రాజధాని వదలివేసి వెళ్లిపోవడంలో అదికారికంగా, అనధికారికంగా రాజీపడ్డానని కూడా చంద్రబాబు ఒప్పుకున్నారని ఆయన అన్నారు కిడ్నాపులు ఆస్తులు పోతాయని చంద్రబాబు చెబుతున్నారని, అంటే దీనర్దం తన ప్రభుత్వం అంత అద్వాన్నంగా ఉందని చంద్రబాబే ఒప్పుకున్నట్లు మాట్లాడారని అన్నారు. 
Image result for buggana about chandrababu & lokesh
ఇంతకీ మూడున్నర కోట్లమంది ప్రజల వ్యక్తిగత సమాచారం ఎలా ప్రైవేటు సంస్థలకు వెళ్లిందన్నదానిపై మాత్రం మాట్లాడలేదని బుగ్గన అన్నారు. 'కొండను తవ్వి ఎలుక' ను కూడా బయటపెట్టలేదని ఆయనఅన్నారు. పార్టీకి చెందిన డేటాపోయిందని చెప్పే చంద్రబాబు ప్రజలందరి డేటా గురించి మాట్లాడరేమిటి? అని ఆయన అన్నారు సేవామిత్ర యాప్ ను ఎందుకు మార్చారు? టిడిపి వెబ్ సైట్ ను ఎందుకు షట్-డౌన్ చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం  చెప్పాలని ఆయన అన్నారు.
Image result for buggana about chandrababu & lokesh
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై తెలంగాణ పోలీసులు దాడి చేయలేదు. తెలుగుదేశం అధినేత ఇంటి పైనా వారు దాడి చేసి సోదాలు నిర్వహించలేదు. వారు తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు, ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ పై సోదాలు నిర్వహించారు. అక్కడ దొరికిన సమాచారాన్ని బట్టి చూస్తే, వచ్చిన ఫిర్యాదుకు సరిగా దానికి సరిపోలుతుంది. అక్కడ ఏదో గోల్-మాల్ జరుగుతూ ఉంది. ఏపీ ప్రజలకు సంబంధించిన డేటాను ఆ సంస్థ తస్కరించింది, దాన్ని అడ్డం పెట్టుకుని ఏపీ ప్రజల ఓట్లను తొలగించే పనిచేస్తూ ఉందని పోలీసులు నిర్ధారించారు. ఆతరవాత జరిగిన విచారణలో తెలంగాణా ప్రజలకు సంబంధించిన సమాచారం లేదా డేఅటా కూడా అందులో ఉందని తెలంగాణా సిట్ అధిపతి స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.  
Image result for buggana about chandrababu & lokesh
హైదరాబాద్ పరిధిలో ఆ పని జరుగుతూ ఉంది కాబట్టి, దానిపై పిర్యాదు కూడా తమకే వచ్చింది కాబట్టి, తెలంగాణ పోలీసులు ఈ అంశం పై విచారణ జరపుతూ ఉన్నారు. ఈ విచారణ విషయంలో దాకవరపు అశోక్ అనే ఐటీ గ్రిడ్స్ అధిపతి తమకు దొరకడం లేదని, అతను పరారీలో ఉన్న నేరస్తుడుగా పోలీసులు ప్రకటించారు. అతడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నామని అంటున్నారు. 
Image result for buggana about chandrababu & lokesh
ఒకవేళ అతడు ఏ నేరమూ చేయకపోతే ఎందుకు పరార్ అయినట్టు? ఒకవేళ అతడు తన సంస్థ ద్వారా డీల్ చేస్తున్నది తెలుగుదేశం పార్టీ సమాచారం మాత్రమే అయితే, పోలీసుల వద్దకు వచ్చి అసలు విషయాన్ని చెప్పి ఎందుకు కేసును ఎదుర్కొనలేదు? ఈ విషయంలో కోర్టును ఆశ్రయించి, తమకు అన్యాయం జరుగుతోందని, తన కంపెనీపై అక్రమ దాడులు సోదాలు జరిగాయని, తమకు సంబంధించిన డేటాను సైతం పట్టుకుపోయారని, అతడు వాపోవడం లేదు.
Image result for buggana about chandrababu & lokesh
అతడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అనేక చట్టన్యాయపరమైన మార్గాలు ఉన్నప్పటికీ, అవేవీ చేయకుండా ఆయనెందుకు పరారీ లో ఉన్నాడు? పోలీసులు బహిరంగ హెచ్చరికలు చేస్తూ ఉన్నా, ఏం చేస్తారో చేసుకోండన్నట్టుగా పరార్ అయ్యాడు. నిజంగా తప్పు చేయకపోతే? నిజంగా అది తెలుగుదేశం పార్టీ డేటా మాత్రమే అయితే అతడు ఎందుకు పరార్ అయ్యాడు? అనే ప్రశ్న ఒక్కదానికీ సమాధానం చెప్పడం లేదు తెలుగుదేశం వాళ్లు!
Image result for buggana about chandrababu & lokesh
ఈ అంశంపై ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. లోకేష్ బాబు ట్విటర్ల లో యుద్ధమే చేస్తూ ఉన్నారు! తెలుగుదేశం నేతలు పిర్యాదుల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇంత పవిత్రులు  అయినప్పుడు, ఆ సంస్థ అధిపతిని ఎందుకు లొంగిపోవాలని టిడిపి సార్వంసహా సార్వబౌములైన తండ్రి కొడుకులు గాని-ఇతర టిడిపి నాయకులుగాని పిలుపునివ్వడం లేదు? అతడి పై కేసులు పెడితే తమపైనే కేసులు పెట్తినట్లు ఏపీ ముఖ్యమంత్రి, లోకెష్ తండ్రి మరియు లోకెష్ ఎందుకు “గుమ్మడికాయల దొంగలెవరంటే భుజాలు తడుముకున్నట్లు” స్పందించారు? అనెది ఐదుకోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల అనుమానం. 
Image result for buggana about chandrababu & lokesh
అమూల్యమైన ప్రజల సామాజిక ఆర్ధిక జీవిత సమాచారంను దొంగిలించి పారిపోయాడనే తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొంటున్నవ్యక్తితరఫున ముఖ్యమంత్రి హోదా లోని వ్యక్తి ఎలా స్పందిస్తారు? పరారీలో ఉన్న నిందితుడుకి ముఖ్యమంత్రి ఎలా ధృవపత్రం ఇస్తారు? అతడు విచారణకు హాజరైతేనే కదా! అసలు విషయం తెలిసేది.
Image result for proximity of dakavarapu ashok with TDP Leadership
అసలు విషయాన్ని దాస్తూ, ఒక పరారీలో ఉన్న నిందితుడి తరఫున మాట్లాడుతూ, అతను రెండు మూడురోజుల్లో బయటకువస్తాడని అనే మాటద్వారా, ఏపీ ముఖ్యమంత్రి ఏపీ ప్రజలకు ఏరకమైన సందేశం ఇస్తున్నట్టు?  ఈ ప్రవర్తనగాని నడవడిక గాని ప్రజాస్వామ్యానికి  ఆమోదయోగ్యమా? ఇది ప్రజలకు అంతుపట్టని ముఖ్యమంత్రి మానసిక వ్యాకులత వైచిత్రికి  కారణమేమిటని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: