ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సీమ టీడీపీలో గ్రూప్ రాజకీయాలు చంద్ర బాబు ను కలవర పాటుకు గురి చేస్తుంది. గత ఎన్నికల్లో అధికారాన్ని అందుకోవడంలో తెలుగుదేశం పార్టీకి రాయలసీమ చాలానే సాయంచేసింది. ప్రత్యేకించి అనంతపురం జిల్లా పన్నెండు సీట్లను కట్టబెట్టి బాబును ముఖ్యమంత్రిని చేసింది. ఇక కర్నూలు కొద్దో గొప్పో సీట్లను ఇచ్చింది. చిత్తూరు చంద్రబాబును ఎమ్మెల్యేగా గెలిపించింది. కడప మినహాయిస్తే.. మిగతాచోట్ల తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఓకే అని చెప్పవచ్చు.

Image result for chandra babu

ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ కాలంలో చాలానే జరిగాయి. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? అంటే.. అంతర్గత కలహాలతో తెలుగుదేశం పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అభ్యర్థుల ఖరారు దశలో తెలుగు తమ్ముళ్లు వీధికి ఎక్కి కొట్టుకుంటున్నారు. నువ్వెంత అంటే.. నువ్వెంత అంటూ వీళ్లు అమీతుమీ తేల్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ ఒకటో రెండో నియోజకవర్గాల్లో ఉండుంటే అదేమీ చెప్పుకోవాల్సినది కాదు. అయితే విబేధాలు లేని నియోజకవర్గాల సంఖ్య తక్కువగా కనిపిస్తూ ఉండటమే ఇక్కడ విశేషం. అటు పుట్టపర్తితో మొదలుపెడితే ఇటు నంద్యాల వరకూ ఇదే పరిస్థితి ఉంది. పుట్టపర్తిలో పల్లెకు వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పడింది. ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దని, ఇస్తే ఓడిస్తామని వారు అంటున్నారు. కళ్యాణదుర్గంలో ఇదే పరిస్థితి. హనుమంతరాయ చౌదరికి వ్యతిరేకంగా పలువురు నేతలున్నారు.

Image result for chandra babu

అనంతపురం అర్బన్‌ సీట్‌ విషయంలో ప్రభాకర్‌ చౌదరి అభ్యర్థిత్వాన్ని రెండువర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. అటు సైపుల్లా వర్గం, ఇటు జేసీవర్గం చౌదరికి టికెట్‌ వద్దని అంటోంది. శింగనమలలో ఇదే పరిస్థితి. అక్కడ టికెట్‌ విషయంలో శమంతకమణి కుటుంబీకులు విబేధించుకొంటూ ఉన్నారు.  గుంతకల్‌లో రచ్చరేగింది. మధుసూదన్‌ గుప్తా చేరికతో, సిట్టింగ్‌ ఎమ్మెల్యే తీవ్ర అసహనంతో ఉన్నారు. రాజీనామా అంటున్నారు. కదిరిలో ఫిరాయింపు ఎమ్మెల్యే వర్సెస్‌ కందికుంట పోరు సాగుతోంది. కర్నూలుజిల్లా ఆలూరు సీట్లో గత ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చిన వీరభద్ర గౌడ్‌ ప్రస్తుత పరిణామాలతో తీవ్ర అసహనంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: