ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. దీనితో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ఇంకా పరుగులు పెట్టించనున్నాయి. 2014లో 9 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉండగా, ఈసారి 10 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉంటాయని సీఈసీ చెప్పారు. 90 కోట్ల మంది ఓటర్లలో 1.5 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్ల వయస్సువారు . ప్రచారం సమయంలో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి నిరాకరణ. 




సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోలింగ్ అబ్జర్వర్లు. 7 విడతల్లో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్. ఏప్రిల్ 11వ తేదీన తొలి విడత పోలింగ్. అంటే ఏపీ, తెలంగాణ లో ఏప్రిల్ 11వ తేదీన తొలి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉంటుంది. ఏప్రిల్ 18వ తేదీన రెండో విడత పోలింగ్ ఉంటుంది. ఏప్రిల్ 23వ తేదీన మూడో విడత పోలింగ్ ఉంటుంది.  ఏప్రిల్ 29వ తేదీన నాలుగో విడత పోలింగ్ ఉంటుంది. మే 6వ తేదీన ఐదో విడత పోలింగ్ ఉంటుంది. మే 12వ తేదీన ఆరో విడత పోలింగ్ ఉంటుంది. మే 19వ తేదీన ఆరో విడత పోలింగ్ ఉంటుంది. 

Image result for elections

ఆంధ్రప్రదేశ్‌లో లోకసభ ఎన్నికలు ఒకే విడతలో ఉండనున్నాయి. తెలంగాణలోను అదే విడతలో ఒకేసారి నిర్వహించనున్నారు. ఏపీలో 25 లోకసభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. అసోం, ఛత్తీస్‌గఢ్‍‌లలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: