జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎన్నికల కమీషన్  మామూలుగా షాకివ్వలేదు. షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమీషన్ ఏపి,  తెలంగాణాలో ఎన్నికలను మొదటి విడత అంటే ఏప్రిల్ 11వ తేదీనే నిర్వహిస్తోంది. అందుకు మార్చి 18వ తేదీ నుండి నామినేషన్లను స్వీకరిస్తోంది. మార్చి 18 నుండి నామినేషన్లంటే ఇపుడున్నది కేవలం వారం రోజులే. వారం రోజుల్లో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించటమంటే మామూలు విషయం కాదు.

 

రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధులను ఫైనల్  చేయటానికి చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డే  పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న విషయం చూస్తున్నదే. జగన్ అయితే పాదయాత్రలోనే సుమారు 25 మంది అభ్యర్ధులను ప్రకటించేశారు. చంద్రబాబు సుమారు 40 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఎంపిక చేసినట్లు లీకులిస్తున్నారు. మరి ఇప్పటి వరకూ ముమ్మిడివరం అసెంబ్లీలో పితాని బాలకృష్ణ పోటీ చేస్తాడని మాత్రమే ప్రకటించిన పవన్ మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్ధులను వారంలోగా ఎలా ఫైనల్ చేయగలుగుతారు ?

 

మరి ఎన్నికల కమీషన్ ఇచ్చిన షాక్ నుండి పవన్ ఎలా బయటపడతాడు ? ఎలాగంటే అందుకు రెండు మార్గాలున్నాయి. మొదటిది తెలంగాణా ఎన్నికల్లో చేసినట్లు చివరి నిముషంలో జెండా ఎత్తేయటం. ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా లేదని సింపుల్ గా చెప్పి ఎన్నికల బరిలో నుండి తప్పించుకున్నారు. ఇపుడు ఏపిలో కూడా ఇదే పనిచేయవచ్చు. 2024 ఎన్నికలకు జనసేన రెడీ అవుతుందని పవన్ చెబితే కాదనే వాళ్ళు ఎవరూ లేరు.

 

ఇక రెండో మార్గం ఏమిటంటే, అందరూ అనుమానిస్తున్నట్లే నేరుగా చంద్రబాబుతో పొత్తు పెట్టేసుకోవటం. నేరుగా పొత్తంటే పవన్ కు చాలా లాభాలున్నాయి. అదేమిటంటే రెండు పార్టీల తరపున అభ్యర్ధులందరినీ చంద్రబాబే నిలబెడతారు.  కాబట్టి  పెద్ద సమస్య నుండి పవన్ బయటపడిపోతారు. ఇక నిధుల సమస్యంటారా అభ్యర్ధులను నిలబెట్టినట్లే డబ్బుల సమస్య కూడా చంద్రబాబే చూసుకుంటారు.

 

పై రెండు మార్గాల్లో రెండో మార్గాన్ని గనుక పవన్ అనుసరిస్తే కనీసం ఎంతో కొంత గౌరవమన్నా ఉంటుంది పవన్ కు. లేకపోతే పవన్ ఎన్ని మాటలు చెప్పినా జనాలు వినరు సరికదా తిరగబడినా తిరగబడతారు. అన్న చిరంజీవి ప్రజారాజ్యంపార్టీని పెట్టి కనీసం పోటీకైనా దిగారు. తమ్ముడు జనసేన పెట్టి చివరకు పోటీ కూడా పెట్టలేకపోతున్నారనే అపఖ్యాతిని మాత్రం మూటగట్టుకోవటం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: