ప్రజా సంకల్ప పాదయాత్ర తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ దిశా దశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన అధినేత జగన్ ప్రత్యర్థి పార్టీల నేతలకు దిమ్మతిరిగిపోయే విధంగా తనదైన శైలిలో రాజకీయం ప్రదర్శించారు. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల తేదీ ప్రకటించటంతో రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల నేతలు ఒక్కసారిగా కంగు తిన్నారు.

Image result for ys jagan

ఏప్రిల్ 11 తెలుగు రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో నెలలోపు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ సీనియర్ నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించినట్టు సమాచారం. అందుబాటులో ఉన్న నేతలతో ఈ సమావేశం నిర్వహించారని తెలుస్తోంది.

Image result for ys jagan

ఎన్నికల షెడ్యూల్, తాజా రాజకీయ పరిణామాలపై చర్చకు వచ్చినట్టు సమాచారం.మరియు అదే విధంగా  పార్టీ మేనిఫెస్టో గురించి ఎన్నికల హామీలు గురించి మరిన్ని సంచలన నిర్ణయాలు ఈ సమావేశంలో జగన్ తీసుకోబోతున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల నుండి వస్తున్న సమాచారం.

Image result for ys jagan

మొత్తంమీద ప్రజా సంకల్ప పాదయాత్ర అయిన వెంటనే ఒకపక్క సమరశంఖం సభలు నిర్వహిస్తూ మొన్న జగన్ పొలిటికల్ కెరియర్ లో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీ వైసిపి పార్టీ భారీ మైలేజ్ అదృష్టవశాత్తూ వచ్చింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దానికి కారణం ఏమిటంటే ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ గాలి భారీగా వేస్తుందని ఇదే సమయంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో నెలలోపే ఎన్నికలు రావడం జగన్ కి మంచి టైమింగ్ అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: