గత సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీలతో కలసి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ రాబోతున్న ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగడానికి దాదాపుగా అంతా రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి తెలుస్తోంది.

Image result for chandrababu

ఈ క్రమంలో రాబోతున్న ఎన్ని మరొకసారి ఆంధ్ర రాష్ట్రంలో అధికారం సంపాదించడం టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రజలకు ఊహించని విధంగా హామీలు ఇస్తూ తాను ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధికి కష్టపడ్డారో వంటి విషయాలను ప్రజలకు తెలియజేస్తూ కేంద్రం ఏ విధంగా రాష్ట్రాన్ని మోసం చేసింది వంటి విషయాలు అర్థమయ్యేరీతిలో సామాన్యులకు భారీ బహిరంగ సభల్లో తెలియజేస్తూ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ఆంధ్ర రాజకీయ నిరసన వ్యక్తం చేస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు.

Related image

ఈ క్రమంలో తాజాగా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల తేదీని ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా లోక్ సభ నియోజకవర్గాల వారీగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Image result for chandrababu

మరోపక్క టీడీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేసే వంద మందికి పైగా అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 12 లేదా 13వ తేదీల్లో టీడీపీ తొలి జాబితా విడుదల చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. కాగా, వివాదంలో ఉన్న స్థానాలకు మాత్రం అభ్యర్థుల ప్రకటన పెండింగ్ లో ఉంచారు. ఆయా నియోజకవర్గాల్లో వివాదాలను పరిష్కరించేందుకు ఓ కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: