ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన బాధ్యత రాష్ట్రప్రజలపై ఉందన్నారు. ఒక వర్గమనే కాకుండా రాష్ట్ర సంక్షేమం, భావి తరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మనస్సాక్షిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తనపై విమర్శలు చేసే వారి గురించి ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరముందని.. ఈ ప్రభుత్వం వల్ల వచ్చిన లాభాలేంటి తనపై వచ్చే విమర్శల్లో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయో గమనించాలన్నారు. 


'నేను గెలవాలి! అది నా హక్కు! హక్కుతో అడుగుతున్నా! నన్ను గెలిపించాలి.  ఎందుకంటే, మీరు నన్ను గెలిపించినందుకు ఐదేళ్ళపాటు మీకు సాయం చేశాను' అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఎన్నికల ప్రకటన తరవాత మీడియా ముందుకొచ్చి ఒకింత సంచలన వ్యాఖ్యలు చేశారు.
Image result for chandrababu in severe depression while asking to vote
ఈ ఎన్నికలు నవ్యాంధ్ర ఆత్మగౌరవానికి పరీక్ష లాంటి వన్నారు చంద్రబాబు. తాను ఐదేళ్లు కష్టపడి చదువుకున్నానని, తనను పాస్ చేయాల్సింది ప్రజలేనన్నారు. ఏపీలో లేనివాళ్లకు ఓటు అడిగే హక్కులేదని, ఐదేళ్లైనా హైదరాబాద్ నుంచి రాలేదని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మొహనరెడ్డిపై మండిపడ్డారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌ కేంద్రం గా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 


తెలంగాణ ప్రభుత్వానికి వైఎస్ జగన్‌ బానిసగా పనిచేస్తున్నారని, నరేంద్ర మోదీ, కేసీఆర్‌కు బానిసత్వం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ కి ఓటు వేస్తే అది కేసీఆర్‌ కి వేసినట్లేనన్నారు. లోటస్‌పాండ్‌ నుంచే అభ్యర్థుల్ని ప్రకటించే వారికి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఏ ముఖ్యమంత్రీ ఇంత దీనంగా, నిరాశా నిస్పృహలతో ఓటర్లని ఇంతలా ఓట్లకోసం ప్రార్ధించిన ఘటనలు చూడలేదు, వినలేదు.
Image result for chandrababu in severe depression while asking to vote
ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ 2014 ఎన్నికల్ని ఎదుర్కొంది. నిజానికి అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో జరిగిన ఎన్నికల కిందనే లెక్క. అప్పటికే విభజన చట్టం ఆమోదం పొందినా, ఎన్నికల తర్వాతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండు గా విడిపోయింది. ఆనాటి ఆ పరిస్థితులు చంద్రబాబుకి చాలా బాగా కలిసొచ్చాయి. వైసిపి తృటిలో అవకాశం చేజార్చుకుంది. చరిత్ర పక్కనపెట్టి చూస్తే టిడిపి పాలనలో ఒక కులం నిరంకుశత్వం రాజ్యమేలిందని అంటున్నారు ముఖ్యంగా ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం జనంలో ఉవ్వెత్తైన జనాభిప్రాయమిది. 


నాలుగున్నరేళ్ళు బిజేపితో అంటకాగి ప్రత్యేకహోదా అంశాన్ని పాతరేసి దానిపై శాసనసభలో-ప్రత్యేకపాకేజీని ఆమోదించి బిజేపినాయకులకు సన్మానాలుచేసి ఒక్కసారి గా యూటర్న్ తీసుకొని ఎన్డీఏ నుండి బయటపడి చేసిన వాగ్ధానాలను ఇప్పటికీ  'గ్రాఫిక్స్‌' చూపుతూ, భ్రమల్లో తను బ్రతికేస్తూ,  ప్రజలను బ్రతకమంటున్నారు. 

పోలవరం ప్రాజెక్ట్‌ కావొచ్చు, అమరావతి కాస్మిక్ సిటీ కావొచ్చు మరేదైనా కావొచ్చు. చంద్రబాబు ఇప్పటికీ గ్రాఫిక్సే చూపిస్తున్నారు. నన్ను మీరు గెలిపించుకోవాలి అని జనానికి చంద్రబాబు చెప్పడమంటే, ఇంకోసారి తన గ్రాఫిక్స్‌ మాయా జాలం లో పడేయాలని చంద్రబాబు కోరుతున్నట్లు ఉంది.  ఇప్పటిదాకా వెలుగు చూసిన సర్వేల న్నీ చంద్రబాబుకి వ్యతిరేకంగానే ఫలితాలిచ్చాయి. 


ఐదేళ్ళపాలన తర్వాత చంద్రబాబు, మళ్ళీ ఆత్మగౌరవ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. సెంటిమెంట్‌ రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో పోటీచేసే వైసీపీ అభ్యర్థు ల్ని హైద్రాబాద్‌లో కేసీఆర్‌ డిసైడ్‌ చేస్తున్నారంటూ కొత్త వాదనను ప్రచారంలోకి తెచ్చారు. మామూలుగా అయితే ఎన్నికల ప్రచారం మొదలైపోయింది కాబట్టి, తమనే గెలిపించాలని ప్రచారం చేసుకోవాల్సిన తరుణంలో, ప్రభుత్వ జీవోలు విడుదల చేస్తుంది.   
Image result for chandrababu in severe depression while asking to vote 

మరింత సమాచారం తెలుసుకోండి: