అరకు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల పై టీడీపీ చీఫ్ స్పష్టత ఇచ్చేసారు. అరకు స్థానంలో కిడారి శ్రావణ్ అభ్యర్థిత్వాన్ని  ఖరారు చేశారు. పాడేరును గిడ్డి ఈశ్వరికే ఖాయం చేశారు. అలాగే రంపచోడవరం టికెట్‌నూ వంతల రాజేశ్వరికే ఖాయం చేసేశారు.

 kidari sravan kumar కోసం చిత్ర ఫలితం



పార్వతీపురాన్ని చిరంజీవులుకు.. సాలూరు స్థానాన్ని బాంజుదేవ్ కు చంద్రబాబు కన్‌ఫామ్ చేసేశారు. ఇందులో చాలావరకూ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినవారే కావడం విశేషం. వీటికి టికెట్ దక్కుతుందా లేదా అని నిన్న మొన్నటి వరకూ టెన్షన్‌లో ఉన్నారు. మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వేళ చంద్రబాబు తేల్చి చెప్పేశారు.

giddi eswari images కోసం చిత్ర ఫలితం


అభ్యర్ధుల ఎంపికలో ప్రజల అభిప్రాయం కూడా తీసుకుంటున్నామని చంద్రబాబు పార్టీనేతలు సర్ది చెబుతున్నారు. అమల్లో ఉన్న స్కీముల పైనా కూడా వైసీపీనేతలు ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందకూడదనే ప్రతిపక్షం ఉద్దేశ్యమంటూ పైర్ అయ్యారు చంద్రబాబు.

vantala rajeswari కోసం చిత్ర ఫలితం


ఏపీ ప్రజల భవిష్యత్తుకు నా బాధ్యత అనే నినాదంతో టీడీపీ ఎన్నికలకు వెళ్లబోతోంది. మరోసారి తెలుగు ఆత్మగౌరవ నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ ఎన్నికల వన్ సైడుగా జరుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కుట్రలు.. డబ్బులు పని చేయవని పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: