ఓవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంలోనే మరోవైపు సీ ఓటర్ సర్వే తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ సర్వే ఫలితాలు సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకున్న జగన్‌కు షాక్ ఇచ్చాయనే చెప్పాలి. ఇప్పటివరకూ ఒక్క సర్వే కూడా టీడీపీది పైచేయి అని చెప్పలేదు.

 à°¸à°‚బంధిత చిత్రం

 మొదటిసారి ఈ సర్వే ఏపీలో టీడీపీకి 14 లోక్‌సభ స్థానాలు వస్తాయని జోస్యం చెప్పడం విశేషం. వైసీపీ 11 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే చెబుతోంది. ఇదే నిజమైతే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీదే పై చేయి అవుతుంది. చంద్రబాబు మరోసారి సీఎం కావడం ఖాయంగా చెప్పొచ్చు.

 à°¸à±€ ఓటర్ సర్వే tv9 కోసం చిత్ర ఫలితం


ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన ఫలితాలే వస్తాయని సీ ఓటర్ సర్వే చెబుతోంది. మొత్తం17 ఎంపీ స్థానాలన్నీ టీఆర్ ఎస్, మజ్లిస్ గెలుచుకుంటాయని సర్వే చెబుతోంది. కాంగ్రెస్ కు కనీసం ఒక్క ఎంపీ స్థానం కూడా రాదని చెబుతోంది.

సీ ఓటర్ సర్వే tv9 కోసం చిత్ర ఫలితం

ఇక కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సీ-ఓటర్ సర్వే అంటోంది. మొత్తం 543 లోక్ సభ స్థానాల్లో ఎన్డీఏకు 264 సీట్లు, కాంగ్రెస్ కు 141 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. మరి ఈ సర్వే ఎంతవరకూ నిజమవుతుందో కానీ.. టీడీపీకి మాత్రం చాలా ఊరటనిచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: