నలభయ్యేళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్ర బాబు ఇప్పటికే జగన్ ను కాపీ కొట్టి నవ్వుల పాలైన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా నుంచి అసెంబ్లీలో నో కాన్ఫిడెన్స్ మోషన్ వరకు జగన్ ను ఫాలో అయ్యారు. అయితే ఇక అభ్యర్ధుల ఎంపికలో ఆచీ తూచీ వ్యవహరిస్తాను, అన్నీ నాకే తెలుసు అని చెప్పుకునే చంద్రబాబు జగన్ ఎంపిక చేసిన వారిని, గెలిపించిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడమే కాదు, వారికే మళ్ళీ సీట్లు ఇచ్చేశారు. ఆ విధంగా జగన్ సెలెక్షన్ ది బెస్ట్ అంటూ ఓటేశారన్న మాట.
Image result for chandra babu

విశాఖ జిల్లా ఏజెన్సీలో పాడేరు సీటుని ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి ఇవ్వడం ద్వారా జగన్ ఎంపికకి బాబు ఒకే చెప్పేశారు. అలాగే కిడారి కుటుంబం నుంచి మంత్రి పదవి ఇచ్చిన శ్రావణ్ కుమార్ కి టికెట్ ఇచ్చి  అక్కడ వైసీపీ నేతలే  తప్ప టీడీపీకి ఎవరూ వేరే లేరన్న దాన్ని చెప్పకనే చెప్పేశారు. సొంత పార్టీ వారికి మొండి చేయి చూపుతూ ఇతర పార్టీల వారికి పెద్ద పీట వేయడం బాబుకు మొదటి నుంచి అలవాటే. గతంలో కూడా విశాఖలో పదేళ్ళ పాటు టీడీపీ జెండా మోసి పనిచేసిన వారిని చంద్రబాబు పక్కన పెట్టి కాంగ్రెస్ నుంచి వచ్చిన గంటా శ్రీనివాసరావు బ్యాచ్ కి ఏకంగా అరడజన్ పైగా టికెట్లు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో  బాబు అన్న మాట ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయా?

Image result for jagan

వచ్చేసారి అందరికీ న్యాయం చేస్తానని. కానీ మరో అయిదేళ్ళకు వచ్చిన తాజా ఎన్నికల్లోనూ మళ్ళీ  వారికే టికెట్లు ఇవ్వడం ద్వారా టీడీపీలో పూర్తిగా పాతవారిని బాబు ఇంటికే పరిమితం చేశారన్న విమర్శలు వస్తున్నాయి. పాడేరులోనే తీసుకుంటే గిడ్డి ఈశ్వరిని తీసుకుని కొన్ని దశాబ్దాల పాటు పార్టీ కోసం పనిచేస్తున్న మాజీ మంత్రి మణికుమారికి బాబు దెబ్బ కొట్టేశారు. అలాగే టీడీనీ  నమ్ముకుని పనిచేస్తున్న గిరిజన నాయకుడు  నాగరాజుని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి పార్టీ విజయానికి క్రుషి చేసిన జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ వంజంగి కాంతమ్మను కూడా బాబు పక్కన పెట్టడం దారుణమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: