ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఇండియా టుడే సర్వే ఫలితాలు రావటం ఆసక్తి కరంగా మారింది. అయితే ఈ సర్వే లో కూడా జగన్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోందని ఘంటా పథంగా చెబుతుంది. ఏపీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం విపక్ష హోదాలో ఉన్న వైసీపీ స్టన్నింగ్ విక్టరీని అందుకుంటుందని తేల్చేసింది. కేవలం లోక్ సభ సీట్ల వరకే ఈ సర్వే వెలువడినా... ఏపీలోని మొత్తం 25 ఎంపీ సీట్లలో జగన్ పార్టీ ఏకంగా 22 సీట్లను కైవసం చేసుకుంటుందని చెప్పడంతో... ఈ దఫా ఏపీ సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయమేనని తేల్చేసినట్టైంది.

Image result for jagan

ఇక ఏపీలో ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్న టీడీపీ కేవలం మూడు ఎంపీ సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని ఆ సర్వే సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఈ సర్వేలో వెల్లడైన అంశాల విషయానికి వస్తే... 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందట. 2014 ఎన్నికల్లో కంటే ఆ కూటమికి దాదాపు నలభై సీట్లు తగ్గుతాయని కానీ ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని ఈ సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 238 సీట్లు ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 285 సీట్లు వస్తాయని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. బీజేపీకి 2014లో ఒంటరిగా 282 సీట్లు వచ్చాయి. ఈసారి 238 సీట్లు వస్తాయని ఈ సర్వేలో తేలింది.

Image result for jagan

అంటే గతంలో కంటే 44 సీట్లు తక్కువ వస్తాయన్న మాట. ఇక పీపీఏగా మారనున్న యూపీఏ కూటమికి ఈ దఫా ఓ మోస్తరు సీట్లు పెరగనున్నాయని ఈ సర్వే తేల్చింది. ఈ కూటమిలో డీఎంకే టీడీపీ జేడీఎస్ ఆర్ఎల్డీ జేఎంఎం ఎన్సీపీ నేషనల్ కాన్ఫరెన్స్ ఐయూఎంఎల్ తదితర పార్టీలు ఉన్నాయి.మార్చి 1వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ మధ్య నిర్వహించిన ఈ సర్వేలో ఏపీకి సంబంధించిన ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గడచిన ఎన్నికల్లో 8 సీట్లను గెలిచిన విపక్ష వైసీపీ ఈ దఫా ఏకంగా 22 సీట్లను గెలుచుకోనుందట. అంటే... ఆ పార్టీకి ఈ దఫా అనూహ్యంగా 14 సీట్లు అదనంగా రానున్నాయన్న మాట. ఇక గడచిన ఎన్నికల్లో 15 సీట్లను గెలిచిన అదికార టీడీపీ ఈ దఫా కేవలం మూడు సీట్లకు పరిమితం కానుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: