ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. అగ్ర తాంబూలం తెలుగు రాష్ట్రాలకు దక్కింది. ఈసారి ఏపీ నుంచే తొలి  విడత పోలింగ్ మొదలుకానుంది. గత సంప్రదాయాలకు భిన్నంగా ఈసారి ఎన్నికల డిజైన్ మార్చారు. ఈ నేపధ్యలో ఒక్కసారిగా ఎన్నికల హడావుడి పెరిగింది. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష  వైసీపీ రెండూ కూడా బస్తీమే సవాల్ అంటున్నాయి.


జగన్ తూర్పు సెంటిమెంట్ :


వైసీపీ అధినేత జగన్ తూర్పు సెంటిమెంట్ తో ఎన్నికల ప్రచారానికి దిగిపోతున్నారు. కాకినాడ వేదికగా ఈ రోజు ఆయన స‌మర శంఖారావం సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దీంతో వైసీపీలో సందడి నెలకొంది. ఏపీలో అధికారం దక్కాలంటే గోదావరి జిల్లాలు  చాలా కీలకం. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గాలి బాగా వీచింది. ఈసారి పరిస్తితుల్లో మార్పు కచ్చితంగా ఉంటుందని వైసీపీ భావిస్తోంది. దాంతో కోటి ఆశలతో కాకినాడ సభకు అధినేత జగన్ వెళ్తున్నారు


తిరుపతి నుంచి బాబు :


ఇక ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అచ్చి వచ్చే తిరుపతి సెంటిమెంట్ ని ఈసారి కూడా కానిస్తున్నారు. ఆయన ఈ నెల 14న తిరుపతి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకుని అనంతరం ప్రచారానికి లాంచనంగా శ్రీకారం చుడతారు. సేవామిత్ర కార్యకర్తలతో పాటు, పార్టీ నాయకులతొ  ఆయన మీటింగ్ పెడతారు. ఆ తరువాత శ్రీకాకుళం వచ్చి అక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. మొత్తానికి ఉన్న తక్కువ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి రెండు పార్టీలు రెడీ అవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: