ఏపీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అపర చాణక్యుడుగా  పేరు గాంచిన చంద్రబాబు దక్షతకు అగ్ని పరీక్షగా 2019 ఎన్నికలు మారుతున్నాయి. అదే సమయంలో వైఎస్సార్ చరిస్మాతో తొలి అడుగు వేసి ఆ తరువాత తనను తాను ప్రూవ్ చేసుకున్న వైఎస్  జగన్ అలుపెరగని పదేళ్ళ పోరాటానికి గీటు రాయిగా ఈ ఎన్నికలు నిలుస్తున్నాయి. ఏపీలో రెండు పార్టీలు టీడీపీ, వైసీపీలకు ఈ ఎన్నికలు ఓ విధంగా జీవన్మరణ సమస్య.


టీడీపీ ఓడితే :


ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడితే ఆ పార్టీకి గడ్డు పరిస్తితులు తప్పవు. బాబు వయసు ఇప్పటికే డెబ్బయ్ ఏళ్ళు. వచ్చే ఎన్నికలు అంటే 2024 నాటికి ఆయన స్టామినా ఇంకా బాగా తగ్గిపోతుంది. ఆయన కుమారుడు నారా లోకేష్ కి తండ్రి సామర్ధ్యం పూర్తిగా రాలేదన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీలో ఇప్పటికీ ఒకటి నుంచి పది వరకూ అన్నీ బాబే అంటారు. బాబు ఈ వయసులో కూడా పోరాట పటిమ చూపిస్తూ ముందుకు సాగడం నిజంగా గొప్ప విషయం. ఆయన ఇప్పటికి మూడు మార్లు సీఎం గా పనిచేశారు. ఆయనకు ఈసారి అవకాశం దక్కపోతే ఇక టీడీపీకి పెద్ద ఎత్తున చిక్కులు వచ్చినట్లే. ఓ విధంగా నలభయేళ్ళ టీడీపీ  అప్రతిహత ప్రస్తానం ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.


వైసీపీ ఓడితే :


ఇక మరో ప్రధాన పార్టీ వైసీపీ. ఆ పార్టీని ఏర్పాటు చేసి ఇప్పటికి 8 ఏళ్ళు అయింది. జగన్ అనేక ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. అలాగే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా గండరగడడు చంద్రబాబునే ఢీ కొట్టారు. కేవలం 0.3 ఓట్ల శాతం తేడాతో అధికారాన్ని కోల్పోయారు. నిజానికి ఓ ప్రాంతీయ పార్టీ అధికారంలోకి మొదటి సారి రాకపోతే ఆ పార్టీ మరి మనుగడలో  ఉండదు. కానీ ఏపీలో అయిదేళ్ళ పాటు బాబు రాజకీయ చాణక్యాన్ని తట్టుకుని పార్టీని మళ్ళీ ఢీ కొట్టేలా సిధ్ధం చేసిన ఘనత అచ్చంగా జగన్ దే. జగన్ ఈసారి అధికారంలోకి రావడం వైసీపీకి చాలా ముఖ్యం. ఈసారి అధికారం దక్కపోతే వైసీపీ కూడా పెను సంక్షోభంలో పడిపోతుంది. అంటే జగన్ కి ఈ ఎన్నికలు చావో రేవో అన్న మాట. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: