పోలీసు విచారణ నుండి తప్పించుకోవాలని ఎత్తులు వేస్తున్న ఐటి గ్రిడ్స్ కంపెనీ ఎండి దాకవరపు అశోక్ కు హై కోర్టు షాక్ ఇచ్చింది. తనపై తెలంగాణా పోలీసులు పెట్టిన కేసును కొట్టేయమంటూ అశోక్ కోర్టులో స్క్వాష్ పిటీషన్ వేశారు. ఆ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు దాన్ని కొట్టేసింది. తక్షణమే పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వాలని కూడా ఆదేశించింది. దాంతో పోలీసుల ముందుకు అశోక్ రాక తప్పటం లేదు.

 

ఏపిలోని 3.5 కోట్లమంది ప్రజల వ్యక్తిగత వివరాలను ప్రభుత్వం ఐటి గ్రిడ్స్ కంపెనీకి అందించిన విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. దానిపై చంద్రబాబునాయుడు, లోకేష్, మంత్రులు, ఉన్నతాధికారులు తలా ఒకరకంగా మాట్లాడుతూ జనాలను అయోమయానికి గురిచేస్తున్నారు. మొత్తం మీద ఎవరెలా మాట్లాడినా అశోక్ ను మాత్రం చంద్రబాబు అండ్ కో నే దాచి పెట్టిందనే నిర్ణయానికి వచ్చారు తెలంగాణా పోలీసులు.

 

ఇదే విషయమై చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో అశోక్ అందరి ముందుకు వస్తాడని నోరుజారటంతో  తెలంగాణా పోలీసుల అనుమానం కూడా నిజమే అయ్యేట్లుంది. ఈ పరిస్ధితుల్లో హై కోర్టు కూడా అశోక్ ను ఆదేశించటంతో ఇపుడు ఏం చేయాలో టిడిపికి అర్దం కావటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: