సినీ నటుడు అలీ తెలుగు దేశం లో చేరడం ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అలీ జగన్ కు జై కొట్టాడు. అయితే అలీ టీడీపీ లో చేరక పోవటానికి కారణం చంద్ర బాబు వ్యవహారశైలేనని తెలుస్తుంది. 2009 నుంచే అలీ, రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించి.. రెండు సార్లు భంగపడ్డారు.. అదీ చంద్రబాబు చేతిలో. 'సీటు ఇవ్వబోతున్నాం..' అని అలీకి ముందే చెప్పి, ఆ తర్వాత 'కేవలం ప్రచారంతో సరిపెట్టుకోవాలోయ్‌..' అని అలీని చంద్రబాబు పలుమార్లు అవమానించారన్న వాదనలున్నాయి. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా.

అలీకీ చంద్రబాబుకీ ఎక్కడ చెడింది.?

మొన్నటికి మొన్న 'అలీ రాజకీయాల్లోకి రావాలి..' అంటూ చంద్రబాబే స్వయంగా వ్యాఖ్యానించారు. అంతకు ముందు అలీ, చంద్రబాబుతోపాటు పవన్‌కళ్యాణ్‌నీ కలిశారు. జగన్‌తోనూ మంతనాలు జరిపారు. చివరికి అలీ, వైఎస్సార్సీపీనే ఎంచుకున్నారు.. తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి. అసలు చంద్రబాబుకీ అలీకీ ఎక్కడ చెడింది.? అంటే, ఇంకెక్కడ పోటీ దగ్గరే. షరామామూలుగానే 'చూద్దాం..' అంటూ చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పేసరికి, గతానుభవం నేపథ్యంలో అలీ జాగ్రత్తపడ్డారు. మరోపక్క టీడీపీ - జనసేన కలిసే అవకాశాలున్నాయన్న ప్రచారం కూడా అలీ, వైఎస్సార్సీపీ వైపు వెళ్ళడానికి కారణమన్న వాదన లేకపోలేదు. సినీ పరిశ్రమలో నటుడిగా సుదీర్ఘ నట ప్రస్థానం అలీ సొంతం. ఈ నేపథ్యంలో అలీ రాక ఎంతో కొంత వైఎస్సార్సీపీకి మేలు చేస్తుందన్న భావనలో వైఎస్‌ జగన్‌ వున్నారు.

Image result for ali ysrcp

ఎన్నికల్లో పోటీ విషయమై అలీ ఇంకా పెదవి విప్పలేదుగానీ, ఆయన పోటీ చేయడం ఖాయమన్న అభిప్రాయాలైతే బలంగా వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీకి ఇటీవలి కాలంలో పలువురు సినీ ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే సినీ గ్లామర్‌.. అన్న ఒకప్పటి మాట ఎలా వున్నా, ఇప్పుడా పార్టీ వైపు సినీ గ్లామర్‌ అస్సలేమాత్రం చూడటంలేదు. జనసేన వైపూ సినీ నటులెవరూ చూడకపోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: