నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్ పార్టీ కి ఎప్పటి నుంచో అండగా నిలుస్తున్న నేత. 2014 లో నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలిచాడు. అయితే ఈ సారి మేకపాటి ని ఒంగోలు ఎంపీగా భరిలో దించ బోతున్నారని తెలుస్తుంది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేయబోతున్నారనే మాట వినిపిస్తోందిప్పుడు! తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు, ఒంగోలు ఎంపీ సీట్లలో ఏది ఇష్టం అయితే దాన్నుంచి పోటీ చేయాలని బాబు బంపర్ ఆఫర్లు ఇచ్చినా.. వాటిని తిరస్కరించారు మాగుంట.

Image result for mekapati rajamohan reddy

ఆయనకు తెలుగుదేశం పార్టీలో ఉండటం ఇష్టంలేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో మాగుంట ఆ పార్టీలోకి చేరాలని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మాగుంటను బుజ్జగించడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. కానీ ఏదేమైనా ఆయన రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాగుంట నెల్లూరు నుంచి పోటీ చేయబోతున్నట్టుగా సమాచారం అందుతోంది.

వైఎస్సార్సీపీ.. నెల్లూరు అభ్యర్థిగా ఆయనా..!

మరి నెల్లూరు నుంచి తాజా మాజీ మేకపాటి ఉన్నారు కదా.. అంటే, ఆయనను ఒంగోలు బరిలో నిలపనుందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. నెల్లూరు, ఒంగోలు రాజకీయ పరిస్థితులు, సామాజికవర్గ సమీకరణాలు దాదాపుగా ఒకేరకంగా ఉంటాయి. నెల్లూరు నేతలే.. అటూ ఇటూ పోటీచేయడం ఇదివరకూ కూడా జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మేకపాటిని ఒంగోలు నుంచి, మాగుంటను నెల్లూరు నుంచి బరిలోకి దించనున్నారనే మాట వినిపిస్తూ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: