భారత దేశ ప్రజలను..ఒక్కసారే ఉలిక్కి పడేలా చేసిన పుల్వామా దాడి దాడి వెనుక వ్యూహకర్త ముదస్సిర్ అహ్మద్ ఖాన్ ను భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ చేశారు. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో మానవ బాంబు రూపంలో దాడికి పాల్పడి 43 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను అన్యాయంగా బలి తీసుకున్నాడు.   సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతికి కారణమైన సూత్రధారి ముదాసిర్‌ అహ్మద్‌ఖాన్‌ను భద్రతా బలగాలు ఖతం చేశాయి. 

మానవబాంబ్‌గా మారిన వ్యక్తికి వాహనంతోపాటు పేలుడు పదార్థాలు సరఫరా చేసింది ఇతనే. త్రాల్‌లోని పింగ్లిష్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కార్డన్‌ సెర్చి ఆపరేషన్‌ నిర్వహించాయి. తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ఇంట్లో దాక్కున్న ముష్కరులు బలగాలపైకి కాల్పులు జరపడంతో వీరు కూడా ఎదురు కాల్పులకు దిగారు. చివరకు సాయుధ బలగాలు ఆ ఇంటిని బాంబులతో పేల్చేశాయి.

ఈ పేలుడులో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరిని పుల్వామా దాడికి పేలుడు పదార్థాలు సమకూర్చిన ముదస్సిర్ అహ్మద్ ఖాన్ గా గుర్తించారు.  23 ఏళ్ల ముదస్సిర్ అహ్మద్ ఖాన్ ని మొహమ్మద్ భాయ్ అని పిలుస్తారు. ముదస్సిర్ 2017లో ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ తో అనుబంధం ఏర్పరచుకున్నాడు. ఉగ్రదాడిలో పాల్గొన్న ఆత్మాహుతి దళసభ్యుడు ఆదిల్‌ అహ్మద్‌దార్‌ దాడికి ముందు పలుమార్లు అహ్మద్‌ఖాన్‌తో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: