రాష్ట్రానికి సార్వభౌమత్వం ఉండదు. జాతీయ సంస్థలను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా నిషేధించటం చట్టపరంగా హక్కు ఉండచ్చు కాని ధర్మబద్ధంగా మాత్రం మంచిది గాదు. చట్టం అనుమతిస్తే ఎంత ధర్మహాని అయినా ఆయన చేయటానికి సిద్ధమేనని దీంతో ఋజువైంది. ఇక్కడ అమరావతి, పోలవరం లాంటి పెద్ద పెద్ద నిర్మాణాలు నడుస్తున్నాయి. వాటికి వివిధ సంస్థలు ఆర్ధిక సహకారమో ఋణం ఇస్తుంటాయి. అలాంటి సంస్థలు ఆ "ఫండ్స్ ఎండ్ యూజ్" కు ధృవపత్రాలను కోరతాయి అది తప్పు కాదు పైగా అలా యివ్వటం ప్రభుత్వ బాధ్యత. చంద్రబాబు నేనెందుకు వినియోగ పత్రాలివ్వాలి? నన్ను అడిగే హక్కు మీకు లేదు అన్న రోజుననే ప్రజాధనానికి కాళ్ళోచ్చాయని జనం భావిస్తారు.

Related image

ఎంత అథమస్థాయికి దిగజారినా ఫర్వాలేదు, ఏం చేసిన ఫర్వాలేదు, వ్యవస్థను ఎంత నాశనం చేసినా ఫర్వాలేదు, ఏ మర్యాదలను ఎంతగా పాతి పెట్టినా ఫర్వాలేదు, ఎన్నికల్లో మాత్రం గెలువాలన్నదే  చంద్రబాబు నినాదంగా కనిపిస్తున్నది. నీతిమాలిన రోత రాజకీయాలు తాత్కాలికంగా ఆవేశకావేశాలు రెచ్చగొట్టడానికి, రాజకీయంగా ఏదో ఒక లబ్ధి పొందడానికి ఉపగయోపవడవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఒక దుస్సంప్రదాయాన్నిపాదుకొల్పుతాయి. చంద్రబాబు బరితెగించి మాట్లాడే ధోరణినే ఆయన అనుచరులు కూడా పాటిస్తున్నారు. చంద్రబాబు తన రాజకీయ అవసరాలకోసం ఆంధ్రసమాజా\న్ని ఒక శాశ్వత, మానసిక, సామాజిక, సంక్షోభంలోకి నెడుతున్నాడు. ఎన్నికలలో గెలుపోటములు ఎలా ఉన్నా రాజకీయాల్లో పది కాలాల పాటు కొనసాగాలనుకునే నాయకులు విచక్షణతో వ్యవహరించాలి.

Related image

కేంద్రం, తెలంగాణ రాష్ట్రం రెండూ ఆయనకు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య అర్ధం ఇదే. చంద్ర బాబు రాజకీయ భాషను దాటి ఉగ్రవాదభాష, సంస్కృతి లోకి దిగజారిపోయారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? చంద్రబాబు ఇంతలా మాట్లాడితే ఆయన కుమారుడు లోకేష్ తో పాటు ఆయన పెంచి పోషిస్తున్న ముఠాలు, కుల వర్గాలు డబ్బుకు దాసోహం అంటూ అభిప్రాయాలను అమ్ముకునే గుంపులు ఎంత తెగబడి మాట్లాడుతాయో అర్థం చేసుకోవచ్చు.

Image result for  chandrababu towards low caste people

స్వార్ధమే పరమార్ధంగా పనిచెసే తెలుగుదేశం ఐటీ గుంపులు, అదీ ఒక సామాజి కవర్గానికి చెందిన ఉన్మాదులు తెలంగాణపై ఎంత మాటవస్తే అంతమాట ఉపయోగించి ట్వీట్లు చేస్తున్నారు. వారి ట్వీట్లలో సమాజానికి మేలు చేసే రాజకీయాలు లేవు, ఒక సైద్ధాంతిక చర్చలేదు, ఒక సందర్భంపై వాదన లేదు. తిట్లు, బూతులు, పరమ జుగుప్సాకరమైన నీచాతినీచమైన భాష, పద ప్రయోగాలుతప్ప. ఉచ్ఛనీచాలు, ఉచితానుచితాలు ఏవీ వారికి పట్టడంలేదు. ఒక నాగరిక జాతి మాట్లాడే భాష నుంచి వారెప్పుడో అథఃపాతాళానికి పడిపోయారు.

Image result for  chandrababu towards low caste people

ఒకరకంగా మతోన్మాధ తీవ్ర వాదులకంటే విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారు. డబ్బులిచ్చి ట్వీట్లు చేయించి, ప్రాంతాన్ని, దేశాన్ని, ఇతర సామాజిక వర్గాలను, ఇతర రాజకీయ వర్గాలను దారుణంగా అవమానిస్తున్న చంద్రబాబు “ట్రోలింగ్ సైన్యం” ఏదో ఒకరోజు అపరాధి లా బోనులో నిలబడాల్సిన రోజు వస్తుంది. చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ను ఏదో తన ప్రైవేట్ కంపెనీ అయినట్టు, దేశ రాజ్యాంగం, న్యాయ సూత్రాలు, చట్టాలు ఏవీ తనకు వర్తించవన్నట్టు చెలరేగి పోతున్నారు. ఈ స్వార్ధ పూరిత గుంపులు స్వార్ధ ప్రయోజనాల సధన కోసం బరితెగించిన ఈ ముఠాలు ఇందుకు తగిన ఫలితాలను అనుభవించి తీరాలి.

Image result for  chandrababu towards low caste people

ఎన్డిఏతో చెలిమి చేసిన నాలుగేండ్ల కాలాన్ని ఆయన రాజకీయ డ్రామాలకు వాడేశారు.  రాజధాని విషయంలో ఆయన వేసినన్ని కుప్పిగంతులు ఎవరూ వేయలేదు. ప్రపంచంలోని అనేక నగరాలతో పోలిక చెప్పి కొత్త కొత్త డిజైన్లు, గ్రాఫిక్స్‌ లు చూపుతూ కాలయాపన చేశారు. నాలుగేండ్ల కిందట ఆయన రాజధాని నిర్మాణం మొదలు పెట్టి ఉంటే ఈ పాటికి ముఖ్యమైన అవసరమైన భవనాలన్నీ పూర్తయి ఉండేవి.

Image result for  chandrababu towards low caste people

రాజకీయంగా కూడా ఆయన అనేకి పిల్లిమొగ్గలు వేశారు. నాలుగేండ్ల కిందట నరేంద్ర మోదీని మహానుభావుడన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీని అంగీకరిస్తూ శాసనసభలో తీర్మానం చేశారు. తీరా ఎన్నికలకు ముందు నరెంద్రమోదీ చంద్రబాబుకు దుర్మార్గుడుగా కనిపిస్తున్నారు. విభేధాలు వ్యక్తుల మద్య, వ్యవస్థ ల మద్య, పార్టీల మద్య రావచ్చు అది సహజం కాని – చంద్రబాబు వాటిని విధ్వేషాలుగా మార్చేయటం అత్యంత దుర్మార్గం.

Image result for chandrababu losts his political charm due to his dirty attitude

అంతేకాదు విద్వేషాలను ప్రచారం చేసే తీరు అత్యంత గర్హనీయం. చంద్రబాబుకు రాజకీయం మాత్రమే కావాలా? సమాజం వద్దా? చేతిలో అధికారం ఉంది కదా అని స్వకుల మీడియాకు కొంత మేత వేసి పిచ్చి రాతలు రాయించుకొని ఇతర రాజకీయ పార్టీలను కులాలను విమర్శిస్తే చివరకు చంద్రబాబుకు ఆయన మీడియాకు చీత్కారాలు మాత్రమే ఎదురవుతాయి తప్ప ఇంకేమీ కాదు!

Image result for  chandrababu towards low caste people

ఉదాహరణకు తన స్వంత బావమరిది నందమూరి బాలకృష్ణ వేసిన కుప్పిగంతులు, పిల్లిమొగ్గలు, చిత్రసీమను అణచిపెట్టి, కొనసాగించిన ఆధిపత్యం, పలు సందర్భా ల్లో పలు వేదికలపై ఆయన ప్రయోగించిన అసాంఘిక పద ప్రయోగాలు నడిచినంతకాలం నడిచాయి. చివరకు తన తండ్రి ఆంధ్రుల అభిమాన ఆరాధ్యనటుడు జీవన చిత్రాన్ని అదీ క్రిష్ లాంటి దిగ్దర్శకుడి చేత నిర్మింపజేసినా అది చీదేసింది. అంతే కాదు ప్రజల్లో ప్రచారం ప్రకారం ఒక ₹75 కోట్ల నష్టం పంపిణీదారులకు మిగిల్చింది. అందుకే చివరకు ఆ మహానుభావుని సినిమా ఐనా అబద్ధాలు చిత్ర విచిత్ర వేషాలు సమాజానికి పొసగని విషయాలు జనాలకు చివరకు తెలుగుదేశం వారికే కాదు బాబు, బాలయ్యల స్వకులజనులకే పట్టలేదు. స్వకుల మీడియా పనిగట్టుకొని తెగరాసినా ఏవరూ స్పందించలేదు. అంటే ఇది చాలు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జనం ఎలా చరమ గీతం పాడబోతున్నారో తెలుపకనే తెలిపింది.

Image result for  chandrababu towards low caste people

తన స్వార్ధం కోసం ప్రజల సామాజిక ఆర్ధిక వ్యక్తిగత రాజకీయ సమాచార చిట్ఠాని ఎవరో ఊరూ పేరులేని అనామకుని కంపెనీకి దారాదత్తం చేయటం, తన పార్టీ స్వార్ధం కోసమైనా సరే అది క్షమించరాని నేరంగా ప్రజలు క్రమంగా అర్ధం చేసుకుంటున్నారు.


సమాజం సర్వనాశనమైనా జనజీవితం భవితవ్యం సంద్రం పాలైనా పర్వాలేదు తనకు తనతర్వాత తన కుమారునికి ఆతరవాత మనవడికి వారసత్వ అధికారం వచ్చి తన కులం బాగుంటే చాలనే చంద్రబాబు జీవించ యోగ్యం కాని సమాజ వాతావరణమే మిగుల్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: