ఐటీ గ్రిడ్స్ సమాచార తస్కరణ కేసులో ఆ సంస్థ ఎండీ దాకవరపు అశోక్‌ కు తెలంగాణ హైకోర్టులో బలమైన దెబ్బే తగిలింది నిజంగా చెప్పాలంటే చుక్కలు కనిపించాయి. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు అశోక్ సమాధానం చెప్పాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఐటీ గ్రిడ్స్‌పై విచారణ కొనసాగించాలని పోలీసులకు కూడా కోర్ట్ సూచించింది. తెలంగాణ పోలీసులకు ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా అశోక్ వేసిన "క్వాష్ పిటిషన్‌" పై హైకోర్టు సోమవారం (మార్చి 11) విచారణ చేపట్టింది. 
Image result for high court on data theft by it grids ashok
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి సిద్ధార్థ్ లుథ్రా, ఐటీగ్రిడ్స్ అశోక్ తరఫున హైకోర్టులో తనవాదనలు వినిపించారు. కేసు విచారణకు పోలీసులకు సహకరించడానికి అశోక్ సిద్ధంగా ఉన్నారని, కానీ, పోలీసులు వేధిస్తున్న కారణంగానే ఆయన ముందుకు రావటం లేదని సిద్ధార్థ్ తెలిపారు. ఐటీ గ్రిడ్స్ భద్రపరిచిన దంతా ఏపీకి సంబంధించిన డేటా అని, అందువల్ల కేసును ఏపీకి బదలాయించాలని కోరారు. తెలంగాణలో విచారణ సరిగా జరగదని నిర్ద్వంధంగా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది ఈ వాదనను పూర్తిగా వ్యతిరేకించారు. 
Image result for high court on data theft by it grids ashok
తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు కూడా అశోక్ స్పందించ లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ వ్యవహారంలో అశోక్ ప్రధాన ముద్ధాయి అని ఆయన్ని విచారిస్తేనే కేసుకు సంబంధించిన కీలక వివరాలు తెలిసే అవకాశం ఉందని వివరించారు. అశోక్‌ను అరెస్టు చేయడానికి ప్రయత్నించ లేదని కూడా వెల్లడించారు. ఐటీగ్రిడ్స్ కేసు విచారిస్తున్న సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర ఆయన బృందంలోని పోలీసు అధికారులంతా కోర్టుకి వచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, కేసు విచారణలో తెలంగాణ పోలీసులకు అశోక్ సహకరించాలని నిర్వివాదంగా సూచించింది. కేసు విచారణ కొనసాగించాలని హైదరాబాద్ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 20 కి వాయిదా వేసింది.
Image result for siddharth luthra

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి సిద్ధార్థ్ లుథ్రా


ఇక ఏపి ముఖ్యమంత్రి ఐటీగ్రిడ్స్ యజమాని దాకవరపు అశోక్ రెండు మూడు రోజుల్లో బయటకు రాగలరని చెప్పి ప్రయివేటు కంపెనీలో లావాదేవీలలోని లాలూచి వ్యవహారాన్ని ప్రభుత్వ సమస్యగా మార్చారు. గతంలో సిఎం రమెష్, బీద మస్తాన్ రావు పై ఆదాయపు పన్ను దాడులు ఏపి ప్రజలపై దాడులుగా అభివర్ణించిన తీరులోనే ఈ కేసు ఉన్నట్లుంది.
Image result for high court on data theft by it grids ashok
ఎందుకో ఒక ముఖ్యమంత్రి స్థాయివ్యక్తి  అపరాధ ఆరోపణలున్న ముద్ధాయిలను వెనకేసుకు వస్తూ ఉండటంతో అమరావతి నేరగాళ్ళ రాజధాని అని అక్కడ నేరగాళ్ళ మీద సీబీఐ మాత్రమే కాదు,  ఏ ఇతర నేర విచారణ సంస్థ, గూడా దాడి చేయలేదని సాక్షాత్తు ముఖ్యమంత్రే కాపాడుతారన్న అభిప్రాయాన్ని దాకవరపు అశోక్ ను వెనకేసుకొని ముఖ్యమంత్రి టిడిపి ప్రజా ప్రతినిధులు రావటమే దీనికి ఋజువు. 

Image result for high court on data theft by it grids ashok

మరింత సమాచారం తెలుసుకోండి: