రైతులకు ఎంతో మేలు జరిగింది వైఎస్సార్ హయాంలోనే. ఆయన రాజ్యంలో అన్న దాత బాగానే బతికాడని చరిత్ర చెబుతుంది. రైతులకు పెద్ద హామీలు ఇచ్చి వారిని సమాదరించిన ఘనత కూడా వైఎస్సార్ దే. ఆయన టైంలోనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతులకు సబ్సిడీలు, రైతు రుణ మాఫీ వంటిని ఎన్నో జరిగాయి. మళ్ళీ అలాంటి రాజ్యం రైతులు చూడలేదన్నది నిజం.


రైతే రాజు :


ఇక ఆయన తనయుడు జగన్ కూడా రైతులే తమకు ముఖ్యమని అంటున్నారు. 2014 ఎన్నికల్లో ఈ నినాదం చంద్రబాబు తీసుకున్నారు. ఆయన రైతు రుణ మాఫీ అంటూ ఇచ్చిన హామీ పదేళ్ళ తరువాత తిరిగి గద్దె మీద కూర్చోబెట్టింది. అప్పట్లో ఆ హామీని ఇవ్వని జగన్ ప్రతిపక్షంలో ఉండాల్సివచ్చింది. ఇపుడు చూస్తే జగన్ కూడా రాజకీయంగా అనుభవం గడించారు. అలవి కానీ హామీల మాట ఎలా ఉన్నా రైతుల కోసం తాను కట్టుబడి ఉంటానని గట్టిగానే చెబుతున్నారు.


రాజన్న మాదిరిగానే :


తన ప్రభుత్వం కూడా అచ్చం రాజన్న మాదిరిగానే ఉంటుందని జగన్ స్పష్టంగా చెప్పుకొస్తున్నారు. రైతులు కోసం వైఎస్సార్ ఎంత చేశారో అంతకు రెట్టింపు తాను చేస్తానని జగన్ ఈ రోజు కాకినాడలో జరిగిన సమర శంఖారావంలో హామీ ఇచ్చారు. రైతులను అన్ని విధాలుగా అదుకుంటామని, రైతు భరోసా కింద ఏడాదికి 12,500 రూపాయలను ప్రతీ ఏడాది మే నెలలో ఇస్తామని చెప్పుకొచ్చారు. వారికి అండగా ఉంటూ నాటి రాజన్న పాలన గుర్తుకుతెస్తానని జగన్ చెబుతున్నారు. మరి చూడాలి ఈసారి రైతన్నల మద్దతు ఎలా ఉంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: