రాహుల్ గాంధి భారత్ కు ప్రధానిగా దేశాధినేతగా సరితూగలరా! ప్రస్తుత భారత ప్రధానికి ప్రత్యామ్నాయం ఎలా ఔతారో ఆ దైవం మాత్రమే చెప్పాలి! 130 కోట్ల సువిశాల భారత ప్రజానీకానికి దిశానిర్దేశం చేయగలిగే, పటిష్ట నాయకత్వం అందించగల సామర్ధ్యం లేశమాత్రం కూడా  కనిపించదు. ఙ్జానం, సభ్యత, సంస్కారం, నాయకత్వం యివ్వగల సమర్ధత ప్రవర్తనలో మాటల్లో బయట పడ్డాయి.

Image result for rahul gandhi masood azhar

“పుల్వామాలో ఆత్మాహుతి దాడి జరిగింది. 40-45 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. సీఆర్‌పీఎఫ్ బస్సుపై దాడికి పాల్పడిందెవరు? జైషే మహమ్మద్. మసూద్ అజర్ పేరు మీకు తెలిసే ఉంటుంది. 56 అంగులాల ఛాతీ ఉందనే నేతల ప్రభుత్వమే మసూద్‌ అజర్ ని విడిచిపెట్టింది. ఇప్పటి జాతీయ బధ్రతా సంస్థ (NSA) సలహా దారు అజిత్ దోవల్ స్వయంగా విమానంలో మసూద్ అజర్ గారి ని తీసుకెళ్లి పాకిస్తాన్‌ కు అప్పగించారు” అన్నారు  రాహుల్ గాంధీ,కాంగ్రెస్ అధినేత.  
Image result for rahul gandhi masood azhar
మసూద్ అజర్! తాజాగా కాదు చాలా కాలం నుండి ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్! పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు! 2016 యూరీ, పఠాన్ కోట్ ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ మన సుశిఖితులైన సైనికులను పొట్టన పెట్టుకున్న ఆధునిక రక్షస సంజాతుడు.  2001లో పార్లమెంట్‌పై దాడికి ప్రణాళిక రచించిన ప్రధాన సూత్రధారి, 2005లో అయోధ్య లో ఉగ్రదాడి,  మొన్న పుల్వామాలో 45 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ‘జైషే మహ్మద్ సంస్థ’ ను నడిపేది ఇతడే. 

Related image
ఇదీ, టెర్రరిస్ట్ అజర్ సంక్షిప్త చరిత్ర. మసూద్ అజర్ పేరు వింటేనే 130 కోట్ల భారతీయుల రక్తం సలసల మరిగిపోతుంది. అలాంటి ఉగ్రవాదిని 'గారు' అని సంబోధించి చిక్కుల్లో పడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఢిల్లీలో ఒక కార్యక్రమానికి హాజరైన రాహుల్ గాంధీ బీజేపీని ఇరుకున బెట్టే క్రమంలో నోరుజారారు. 1998లో మసూద్‌ని బీజేపీ ప్రభుత్వమే విడిచి పెట్టిందని విమర్శించే క్రమంలో, మసూద్‌ అజర్‌ ని 'గారు' అని సంబోధించారు.
Image result for rahul gandhi masood azhar
కరుడుగట్టిన ఉగ్రవాదిని రాహుల్ గాంధీ 'జీ' అని సంబోధించడంపై దుమారం రేగుతోంది. రాహుల్ గాంధీ ఉగ్రవాదుల ప్రేమికుడు అంటూ బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. #ఋఅహుల్ళొవెస్టెర్రొరిస్త్ హ్యాష్‌ట్యాగ్‌ ను ట్రెండ్ చేస్తూ కాంగ్రెస్ వైఖరిపై విరుచుకుపడుతున్నారు నేతలు పాకిస్తాన్‌కు, రాహుల్‌కు టెర్రరిస్టులంటేనే ఇష్టమంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.
Image result for rahul gandhi masood azhar

మసూద్ అజర్ మొదట్లో హర్కతుల్ అంసార్ సంస్థలో పని చేసేవాడు. కాశ్మీర్‌ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ పట్టుబడ్డాడు. భారత సైన్యం అతడిని అరెస్ట్ చేయడంతో జైలు శిక్షపడింది. కానీ 1999 లో అతని మద్దతుదారులు భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్‌కు తీసుకెళ్లారు. మసూద్ అజర్‌ని విడిచిపెడితేనే 160 మంది ప్రయాణికులను వదలేస్తామని కండిషన్ పెట్టడడంతో,  తప్పనిసరి పరిస్థితుల్లో మసూద్ అజర్‌ని విడుదల చేసింది భారత్ ప్రభుత్వం. 

Image result for rahul gandhi masood azhar
పాకిస్తాన్‌కు వెళ్లిన తర్వాత కొన్నాళ్లకు భావల్‌పూర్ కేంద్రంగా జైషే మహ్మద్ ఉగ్రసంస్థను స్థాపించాడు మసూద్ అజర్. అందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ సాయం చేసింది. ఆ తర్వాత భారత్‌లో ఎన్నో ఉగ్రదాడులు చేసి విధ్వంసం సృష్టించాడు. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితిలో తీవ్ర ప్రయత్నం చేస్తోంది. కానీ ప్రత్యేక వీటో అధికారంతో భారత్‌ ప్రతిపాదనకు చైనా పదేపదే మోకాలడ్డుతున్న విషయం తెలిసిందే.

Image result for rahul gandhi masood azhar

మరింత సమాచారం తెలుసుకోండి: