ప్రొద్దుటూరులో రాజకీయ వాతావరణం అంతా మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకే అనుకూలిస్తూ వచ్చేది. అయితే 1985లో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ నుండి నంద్యాల వరదరాజులరెడ్డి గెలుపొంది కాంగ్రెసు ఊపుకు బ్రేకులు వేశాడు. తర్వాత కాంగ్రెస్ లోకి మారినా వరదరాజులరెడ్డి వరుసగా నాలుగుసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2009లో మల్లెల లింగారెడ్డ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి అతనికి షాకుని ఇచ్చాడు. గత ఎన్నికల్లో వైసిపి తరపున రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విజయ భేరి మోగించగా, అవతలి వైపు తెదేపా నుండి పోటీ చేసిన వరదరాజులు రెడ్డి ఈ సారి మాత్రం ఖచ్చితంగా గెలవాలనే కసితో ఉన్నాడు. లింగా రెడ్డి ని కాదని కొత్తగా పార్టీలో చేరిన వారు రాజు రెడ్డి కి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం టీడీపీ శ్రేణుల్లో కలకలాన్ని రేపినా ఇప్పుడు పరిస్థితి ఇ అంతా సద్దుమణిగిందని చెప్పాలి. మొత్తానికి మళ్లీ పాత ప్రత్యర్థులే అమీతుమీ తేల్చుకోవడానికి మళ్లీ ప్రొద్దుటూరులో సిద్ధమయ్యారు. రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ప్రొద్దుటూరులో ఏ పార్టీ నీ విజయం సాధిస్తుంది అనేది ప్రస్తుతానికి అంచనా వేయలేకపోయినా, జనాల నాడి మాత్రం జగన్ వైపే మొగ్గు చూపుతుంది అనేది విశ్లేషకుల అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: