పవన్ కళ్యాణ్ తొలిసారిగా తాను అనంతపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తాను అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో లో గెలుపు అతను అనుకున్నంత సులువేమీ కాదు. క్రితంసారి ఎన్నికల్లోనే కేవలం 9 వేల ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి ప్రభాకర్ చౌదరి వైఎస్ఆర్సీపీకి చెందిన గురునాథ రెడ్డి పైన గెలుపొందాడు. ఈసారి మాత్రం వైసీపీ నుండి మహాలక్ష్మి శ్రీనివాస్ కు సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. వీరికి పవన్ కళ్యాణ్ గనుక తోడు అయితే ఇక అక్కడ యుద్ధమనే చెప్పాలి. దాదాపు అంతా ఇక్కడ టీడీపీ మద్దతుదారులు ఎక్కువగా ఉండే ఏకైక రాయలసీమ జిల్లాగా ఈ అనంతపురానికి పేరు. ఆర్థికంగా వెనుకబడిన ఈ జిల్లా సరైన అభ్యర్థుల వేటలో అనునిత్యం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నుండి మళ్లీ ప్రభాకర్ చౌదరి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య పరిటాల ఫ్యామిలీ పైన ప్రజలు తిరగబడిన తీరు చూసి టీడీపీ శ్రేణుల్లో కొంత ఆందోళన రేగుతోంది. మరో వైపు వైసీపీ ఈ జిల్లాలో పట్టు సాధించి రాయలసీమ మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: