ఎప్పటినుండో నగిరి లో కాంగ్రెస్ ప్రభుత్వం తమ హవా చూపుతూ ఉండేది. ఒక్క రెడ్డి వారి చెంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున 5 సార్లు నగిరి నియోజకవర్గం లో విజయదుందుభి మోగించారు. మధ్యలో ఒక రెండు సార్లు లు తెదేపా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించినా, క్రితం సారి రోజా 858 ఓట్ల అతి స్వల్ప మెజారిటీ తో గట్టెక్కింది. అటువైపు టీడీపీ నుండి గాలి ముద్దకృష్ణమనాయుడు మళ్లీ తేదేపా వైపు పోటీ చేస్తుండడంతో ఈ సారి కూడా రోజా క్రితం సారిలాగా శ్రమించాల్సి అవసరం రావొచ్చు. అయితే ఆమె చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంత దూరం తనని వెళ్లనివ్వవు అని ఇక్కడి ప్రజల మాట. ఆంధ్ర – తమిళనాడు సరిహద్దు ప్రాంతంగా ఉండే నగిరీలో దాదాపు రెండు భాషలు వచ్చిన వారి సంఖ్య అధికం. టీ.వీ షో ల ద్వారా రోజాకి వచ్చిన ఆదరణ కూడా ఆమెకు ప్లస్ కావచ్చు. మరో  వైపు ముద్దుకృష్ణమ నాయుడు కూడా ఎంతో పక్కా ప్రణాళికతో ముందుకు దూసుకుపోతున్నాడు. అతనిని తక్కువ అంచనా వేయడానికి అస్సలు వీలు లేదు. కాబట్టి పోరు హోరాహోరీ అయినా వైసీపీ మాత్రం ఈ నియోజకవర్గంలో ముందంజలో ఉందనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: