రాజకీయాల్లో అవకాశాలు ప్రజలే ఇవ్వాలి. ఎందరో మహానుభావులు అపర మేధావులు ప్రజల అశీర్వాదం లేకపోవడం వల్ల రాజకీయంగా ఏమీ కాకుండా మిగిలిపోయారు. దేశానికి ఏదో చేయాలని ఎవరు  అనుకున్నా ప్రజల మద్దతు చాలా ముఖ్యం. మరి ప్రజలు ఎవరిని దీవించి చట్ట సభలకు పంపిస్తున్నారో అందరికీ తెలిసిందే.


ఏపీ విషయానికి వస్తే ఒక్క చాన్స్ ఇవ్వమని వైసీపీ అధినేత కాకినాడ సభ ద్వారా  జగన్ అడుగుతున్నారు. తొమ్మిదేళ్ళుగా పార్టీ పెట్టి జనం మధ్యనే ఉన్న జగన్ రెండవ మారు సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో పాల్గొంటున్నారు.  2014 ఎన్నికల్లో త్రుటిలో అధికారం కోల్పోయిన జగన్ పట్ల జనంలో సానుభూతి ఉంది. అయితే మరో వైపు రాజకీయ చాణక్యుడు చంద్రబాబు ప్రధాన పోటీదారుగా  ఉన్నారు. అప్పటికపుడు పరిస్థితులను మార్చేసే నైపుణ్యం చాతుర్యం బాబు సొంతం. ఏపీని తానే మళ్ళీ మళ్ళీ  పాలించాలన్న కసి బాబులో ఉంది. దానికి తగినట్లుగా ఆయన 2014లో అధికారంలోకి వచ్చిన మరుసటి నుంచి తన పధకాలను అమల్లో పెట్టారు. ఎన్నికలు అయితే వచ్చే నెలలో జరుగుతున్నాయి కాంగీ బాబు మాత్రం ఎపుడో ప్రిపేర్ అయిపోయారు.


ఇక ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్య హోరా హోరీ పోటీ ఉంది. అటు చంద్రబాబు, ఇటు జగన్. ఇద్దరి దక్షలను పూర్తిగా ఎరిగిన జగన్ ఈసారి తమ తీర్పు ఇవ్వబోతున్నారు. మరి జగన్ కోరినట్లుగా ఒకసారి చాన్స్ ఇస్తారా అన్నది  చూడాలి. జగన్ 14 నెలల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేసి తన పట్టుదలను నిరూపించుకున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడన్న నమ్మకాన్ని కూడా సంపాదించారు. అదే సమయంలో కొన్ని సమస్యలపై బాగానే అసెంబ్లీ లోపలా బయటా పోరాడారు. మరి కొన్ని సమస్యలు కూడా వదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా జగన్ ప్రవేశపెట్టిన నవ రత్నాలు పధ‌కాలు మంచివేనని బాబు వాటిని కాపీ కొట్టడం ద్వారా జనానికి సందేశాన్ని పంపించారు.


మరి పధకాలు ప్రవేశపెట్టిన జగన్ కి ఓటు వేస్తారా, లేక బాబుకు ఓటు వేస్తారా అన్నది  కూడా ఇక్కడ చూడాలి. ఇక తీర్పు విషయంలో    ఏపీ జనాలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నది నిజం. ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నాయి. తీర్పునకు వేళ అయింది. ఎవరి కధ ఏంటో ఈవీఎంలే చెబుతాయి.
               


మరింత సమాచారం తెలుసుకోండి: