ఉత్తరాంధ్ర జిల్లాలు విభజన తరువాత చాలా కీలకమైనవిగా ఉన్నాయి. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో అయిదవ వంతు ఇక్కడే ఉన్నాయి. పైగా ఇక్కడ ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారే రేపటి ఎన్నికల్లూ అధికార పీఠం మీద ఉంటారు. గత ఎన్నికల్లో టీడీపీ జెండా ఎత్తిన ఈ మూడు జిల్లాలు ఇపుడు ఏం చేస్తాయన్నది అందరి ప్రశ్న.


ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపీకి కంచుకోటలు. ఆ పార్టీ ఆవిర్భావం  నుంచి కొమ్ము కాస్తూ వస్తున్నాయి. అయితే రెండు సందర్భాల్లో మాత్రం ఆ కంచుకోటలను బద్దలు కొట్టిన ఘనత దివంగత వైఎస్సార్ కి దక్కింది. ఆయన 2004 ఎన్నికల్లో, 2009లో ఇక్కడ కాంగ్రెస్ కి తన చరిస్మాతో ఎక్కువ సీట్లు సాధించిపెట్టారు. అప్పట్లో టీడీపీ ఇక్కడ చిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీకి చెందిన యోధానుయోధులు ఓటమి పాలు అయ్యారు. అది ఓ ప్రభంజనం.


మళ్ళీ అటువంటి ప్రభంజనం వస్తుందా. వస్తే పరిస్థితి ఏంటి అన్న చర్చ ఇపుడు సాగుతోంది. జగన్ పాదయాత్రకు మూడు జిల్లాల జనం పోటెత్తారు. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో జనం నీరాజనం పట్టారు. బడుగులు బలహీన వర్గాలు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో ఇపుడు బాగా మార్పు వస్తోంది. ఈసారి వారు వైసీపీ వైపు చూస్తున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే మరోసారి నాటి వైఎస్సార్ ప్రభంజనం వీచడం ఖాయం . అపుడు ఉత్తరాంధ్రాలోని 34 సీట్లకు గాను పాతికకు పైగా వైసీపీ కైవశం అవుతాయని లెక్కలు వేస్తున్నారు. ఇప్పటికైతే వైసీపీకి అంతా అనుకూలంగానే కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: