ఎన్నికల సమయంలో నేతల ఆరోపణలు పెచ్చుమీరుతున్నాయి. ఒకరిపై మరొకరు బురద జల్లుకోవడం కామన్ అయ్యింది. తాజాగా చంద్రబాబు జగన్ పై పెద్ద అభాండమే వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ లో వేలం ప్రకారం అభ్యర్ధుల ఎంపిక జరుగుతోందంటున్నారు. సీటుకు పాట పెట్టి ఎవరెక్కువ డబ్బులు పెడితే వాళ్లకే వైసీపీ టిక్కెట్టు ఇస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. 



ఒకరోజు 10కోట్లు పెట్టే అభ్యర్ధికి, రెండోరోజు 20 కోట్లు పెట్టే అభ్యర్ధికి, తరువాత రోజు మరింత... ఇలా ఆక్షన్ పెట్టి  టిక్కెట్లు ఇచ్చే పార్టీ దేశంలో వైసీపీ మాత్రమే నంటున్నారాయన. ఎవరికి సీట్లు వస్తాయో వైసిపిలో చెప్పలేని దుస్థితి ఉందని.. టీడీపీలో మాత్రం ప్రజాసేవే అభ్యర్ధుల ఎంపికకు ప్రామాణికమంటూ సుద్దులు చెబుతున్నారు చంద్రబాబు. 



గాలికి వచ్చినాళ్లు గాలికే పోయే పరిస్థితి ఉందని.. వాళ్లే వచ్చారు, వాళ్లే వెళ్లారు.. అక్కడికి వెళ్లి దిక్కుతోచకుండా ఉన్నారు... మళ్లీ టిడిపిలోకి వస్తామంటున్నారు. మళ్లీ ఇక్కడకు రావాలన్నా వద్దని చెప్పాను... అంటూ తనను కలిసేందుకు వచ్చిన పార్టీ శ్రేణులతో చంద్రబాబు చెబుతున్నారు.



రోజురోజుకూ టిడిపి గ్రాఫ్ పెరుగుతోంది... 95లక్షల మంది మహిళలకు పసుపు-కుంకుమ ఇచ్చాం.. 70లక్షల రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం ఇస్తున్నాం. లక్షలాది మందికి యువనేస్తం భృతి ఇస్తున్నాం.. తులు,మహిళలు,యువతరమే టిడిపికి పునాదులంటు కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: