వైసీపీ అధినేత ఓ లెక్క ప్రకారం విశాఖ జిల్లా రాజకీయాలను చేసుకుంటూ వస్తున్నారు. సీనియర్లను పార్టీలోకి తీసుకున్నా, జూనియర్లకు పెద్ద పీట వేసిన జగన్ అంచనాలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావుని జగన్ ఏ విధంగా ఉపయోగించాలన్న దానిపై స్కెచ్ రెడీ చేసి పెట్టుకున్నారని వినిపిస్తోంది.


విశాఖ జిల్లాలో ఉన్న మరో సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణకు చెక్ పెట్టేందుకే జగన్ దాడిని పార్టీలోకి తీసుకున్నారని అంటున్నారు. దాడి వీరభద్రరావుకు ఎక్కడ సీటు ఇవ్వాలన్నది కొణతాలకు టీడీపీలో ఇచ్చే సీటు మీదే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. కొణతాల అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. అదే జరిగితే దాడిని కూదా అనకాపల్లి ఎంపీ సీటుకే పోటీ చేయించేందుకు జగన్ నిర్ణయించారని వినిపిస్తోంది. ఇక కొణతాల‌ అనకాపల్లి అసెంబ్లీకే పోటీ పడితే మాత్రం దాడిని కూడా అక్కడే పోటీ చేయిస్తారట.


ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. కొణతాల, దాడిల మధ్యన దశాబ్దాల రాజకీయ వైరం ఉంది. అదే విధంగా జగన్ కి కూడా తన తల్లి విజయమ్మను కొణతాల గత ఎన్నికల్లో సరిగా పనిచేయక ఓడించారని అనుమానాలు ఉన్నాయి. ఇపుడు కొణతాలను ఓడించడం జగన్, దాడి ఇద్దరికీ అవసరమే. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: