సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ, తెలుగుదేశం మధ్య బంధం ఉందని గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. కానీ జేడీ తానేదో సొంత పార్టీ పెడతానని.. రాజకీయాలు మారుస్తానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు రాష్ట్రమంతా పర్యటించి చాలా పరిశోధన కూడా చేసినట్టు చెప్పుకున్నారు. కానీ చివరకు ఆయన టీడీపీ వైపే మొగ్గుతున్నారని తెలుస్తోంది. 

cbi jd lakshmi narayana కోసం చిత్ర ఫలితం


ప్రముఖ దిన పత్రిక ఈనాడులో వచ్చిన కథనం ప్రకారం ఆయన టిడిపిలో చేరి భీమిలి నుంచి పోటీచేయవచ్చని చెబుతున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ లో ఆయనతో భేటీ అయ్యారని కూడా ఆ కధనం వెల్లడించింది. లక్ష్మీనారాయణ సొంతంగా పార్టీ పెట్టాలని అనుకున్నా... కాని అది సాధ్యం కాకపోవడంతో టిడిపి చొరవ తీసుకుని మంతనాలు జరిపిందట. దాంతో ఆయన అంగీకరించారని చెబుతున్నారు.

సంబంధిత చిత్రం


జేడీ త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన భేటీ కావచ్చని కధనం చెబుతోంది. మొదట భీమిలి నుంచి మంత్రి లోకేశ్‌ పోటీ చేయాలని భావించారు. కానీ  ప్రస్తుతం ఆయన కన్ను  విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గంపై పడిందట. కాబట్టి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను భీమిలి నుంచి బరిలో దింపేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారట. 

సంబంధిత చిత్రం

ఇక జేడీ పూర్వ చరిత్ర తెలిసిందే. హైదరాబాద్‌లో సీబీఐ సంయుక్త సంచాలకుడిగా పనిచేసిన లక్ష్మీనారాయణ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అక్రమాస్తుల కేసుల్ని దర్యాప్తు చేశారు. మహారాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఆయన ప్రభుత్వ సర్వీస్‌ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. మొత్తానికి అటూ ఇటూ తిరిగి జేడీ చంద్రబాబు వైపే మొగ్గారన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: