కొత్త బిచ్చగాడు పొద్దెరగడు..అని ఓ సామెత.. అంటే ఏదైనా కొత్తలో విజృంభించి పని చేస్తారని చెప్పడానికి ఈ సామెత వాడతారు. ఇప్పుడు ఇది టీడీపీలో ఇటీవల చేరిన సినీ నటి దివ్యవాణికి అతికినట్టు సరిపోతుంది. ఔను మరి ఆమె ఇప్పుడు మామూలుగా ఓవర యాక్షన్ చేయడం లేదు మరి. 

divyavani chandrababu కోసం చిత్ర ఫలితం

ఇటీవల కొందరు నటీమణులు టీడీపీని విమర్శించడం చూసి ఆమె తట్టుకోలేకపోతోందట. అందుకే ప్రెస్ మీట్ పెట్టి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది. ఆమె ఏమంటుందంటే.. వైసీపీ కొందరి ఆడ రౌడీలను తయారు చేసి టీడీపీ మీదకు వదులుతోంది... తెలంగాణలోని సినీ నటులు గౌరవం నిలబెట్టుకోవాలి...

సంబంధిత చిత్రం

చంద్రబాబు మీద అవాకులు చవాకులు పేలితే సహించం...టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు చంకనాకి.. ఇప్పుడు విమర్శలు చేస్తారా..? వేయి మంది సినీ నటులతో మేమూ జగన్ను తిట్టించగలం... ప్రస్తుతం హైదరాబాదులో సినీ నటులు తిరుగుతున్న రోడ్లు.. ఫ్లైఓవర్లు చంద్రబాబు వేసినవి కావా..?

సంబంధిత చిత్రం
పక్క రాష్ట్రానికి బానిసగా ఉన్న వ్యక్తికి ఓటేస్తే బానిసత్వంలోకి నెడతారు... పక్క రాష్ట్రంలో ఆడవాళ్ల కొబ్బరికాయలు నరికినట్టు నరికేస్తున్నారు. ఇలా సాగిపోతోంది దివ్యవాణి నోటి దురుసు. పాపం ఈవిడ స్వామిభక్తి బాగానే ప్రదర్శిస్తోంది. మరి చంద్రబాబు గమనిస్తున్నారో లేదో.. 



మరింత సమాచారం తెలుసుకోండి: