రాజకీయ దురంధరుడు. అపర చాణక్యుడు. అనిపించుకున్న చంద్రబాబునాయుడు కి కూడా ఎన్నో ప్లస్సులతో పాటు మరెన్నో మైనస్సులు ఉన్నాయి. ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నో  గెలుపులను, మరెన్నో ఓటములను కూడా చూశారు. అయితే కాలం కలసి రావడంతో మైనస్ లు మరుగున పడిపోయినా సరైన రాజకీయ  ప్రత్యర్ధులు ఎదురు నిలిచినపుడు బాబు గారి పాలిటిక్స్ అంత ఈజీగా సాగలేదు. ఈసారి కూడా ఎన్నికలు వచ్చేశాయి. మరి బాబు గారి మైనస్ పాయింట్లు ఏంటి. ఎలా వాటిని అధిగమిస్తారో  చూద్దాం.


1. మాట నిలకడలేనితనం బాబులో అతి పెద్ద మైనస్ పాయింట్. ఇక గత అయిదేళ్ళ కాలంలో ఆయన తీసుకున అనేక నిర్ణయాలు ఆయన్ని యూ టర్న్ సీఎం గా మార్చేశాయి. దాతో బాబు చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన ఉండదన్నది పెద్ద విమర్శ.

2. ప్రత్యేక హోదా విషయంలో బాబు అన్నీ అందుబాటులో ఉన్నా కేంద్రంతో రాజీ పడ్డారని, ఏపీకి హోదాను తెచ్చే విషయంలో ఆయన రాజీ పడ్డారన్న విమర్శ కచ్చితంగా అతి పెద్ద మైనస్ పాయింటే.

3. అమరావతి, పోలవరం వంటి వాటి పేరు చెప్పి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇపుడు వాటిని ముందుంచి జనాలను ఓట్లు అడగలేని పరిస్థితి ఉంది. దాంతో అతి పెద్ద మైనస్ గా అది మారే ప్రమాదం ఉంది.

4. రైతులు, మహిళల విషయంలో ఇచ్చిన హామీలు, యువతకు చేసిన నిరుద్యోగ భ్రుతి ప్రామిస్ వంటివి చివర్లో చేసినా కూడా మాట తప్పారని మాత్రం బాబు పైన బలమైన భావన పడింది. అది ఒక మైనస్ పాయింట్ గానే చూడాలి.

5. అందరి లాగానే బాబులోనూ పుత్రోత్సాహం ఉంది. ఆయన కుమారుడు నారా లోకేష్ ని మంత్రిని చేయడం వల్లనే టీడీపీ లోపలా బయటా కూడా కామెంట్స్ బాగా ఉన్నాయి. బాబు అయిదేళ్ల పాలనలో అదే పెద్ద మైనస్ పాయింటు. అవినీతి బంధుప్రీతి అన్న కామెంట్స్ వ‌చ్చినపుడు దాన్ని తిప్పికొట్టడం బాబు వల్ల కాకపోవడం మైనస్ పాయింటే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: