ఏపీ  రాజకీయ కేంద్రం విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధి ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రోజుకో పేరు తెరపైకి వస్తూ ఉత్కంఠను పెంచుతోంది. రెండ్రోజుల క్రితమే సీనియర్ నేత దాసరి జై రమేష్ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో ఎంపీ సీటు ఆయనదే అన్న ప్రచారం జరిగింది. కేశినేని వర్సెస్ దాసరి  ఫైట్ తప్పదనుకున్న సమయంలో వైసీపీ నుంచి మరో పేరు తెరపైకి వచ్చింది.


పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్... పీవీపీ విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. రేపు ఆయన లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని సమాచారం. కేశినేని నాని లాంటి వ్యక్తిని ఢీకొట్టడానికి పీవీపీనే ధీటైన వ్యక్తి అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో దాసరి జైరమేష్ ను ఏం చేస్తారోనన్న మరో చర్చ మొదలైంది. పీవీపీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సన్నిహితంగా ఉండేవారు.


 2014లో టీడీపీ తరపున విజయవాడ ఎంపీ సీటు కోసం  పవన్ ద్వారా ప్రయత్నాలు చేశారు. అయితే అది సాధ్యపడలేదు. దీంతో వైసీపీ నుంచైనా సీటు సాధించడానికి గట్టిగానే ప్రయత్నించారు. అదీ కుదరలేదు. దీంతో మిన్నకుండిపోయారు. లోక్ సభలో అడుగుపెట్టాలని గట్టిగా భావిస్తున్న ఆయన ఈసారి మాత్రం వైసీపీ సీటు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి పావులు కదుపుతున్నారు. దీంతో జగన్ ఆయనకు ఖచ్చితంగా విజయవాడ సీటును ఇస్తారని చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: