జేడీ లక్ష్మి నారాయణ..  జగన్ కేసుల ద్వారా బాగా సుపరిచితుడయ్యాడు. అప్పుడు టీడీపీ మీడియా కు జగన్ కేసు గురించి లీకులు ఇస్తూ , కేసు వ్యవహారాన్ని కొనసాగించాడు. దీనితో జేడీ ని టీడీపీ మీడియా ఓ రేంజ్ లో చూపించింది.  అప్పట్లో అధికారంలో ఉండిన కాంగ్రెస్ పార్టీ తొత్తుగా వ్యవహరించారనే విమర్శకు గురయ్యారు. జగన్ కేసుల్లో లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో మోపిన అనేక అభియోగాలు ఆ తర్వాత కోర్టులో చెదిరిపోవడమే అందుకు రుజువు కూడా.

Image result for jd lakshminarayana

ఆ సంగతలా ఉంటే.. జగన్ కేసుల్లో విచారణ చేశాడు కాబట్టి.. ఆయన గొప్పోడు అని తెలుగుదేశం పార్టీ ఆయన కోసం కటౌట్లు కట్టినప్పుడే రాజకీయమయం అయిపోయింది లక్ష్మినారాయణ వ్యవహారం. ఆ తర్వాత ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అంటూ ఉద్యోగానికి రాజీనామా చేసి కూడా బయటకు వచ్చారు. సొంత పార్టీ అని హడావుడి చేశారు. ఆ తర్వాత దివాళా దశలో ఉన్న లోక్ సత్తాను టేకోవర్ అని అన్నారు.

Image result for jd lakshminarayana

అవన్నీ కాదు.. ఇప్పుడు సూటిగా సుత్తిలేకుండా.. తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారట. ఈ విషయాన్ని తెలుగుదేశం అనుకూల మీడియానే ధ్రువీకరిస్తూ ఉంది. ఈయన పోటీకి నియోజకవర్గం కూడా రెడీ అయ్యిందట. ఇప్పటికే గంటా శ్రీనివాసరావుతో సమావేశం అయ్యారట ఈ మాజీ జేడీ. భీమిలి నుంచి లోకేష్ పోటీచేయడం లేదని.. అక్కడ నుంచి లక్ష్మినారాయణను పోటీ చేయించాలని అనుకుంటున్నారట. మొత్తానికి ఏ గూటి చిలకలు ఆ గూటికే చేరుతున్నట్టుగా ఉన్నాయి. మరి ఇన్ని రోజులు చేసిన హడావుడి ఏమైనట్టో ..!

మరింత సమాచారం తెలుసుకోండి: