ప్రకాశం జిల్లాలో టీడీపీ, వైసీపీల నుండి పోటీ చేసే అభ్యర్ధులపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. జిల్లాకు చెందిన కీలక నేత, టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతుండటంతో.... జిల్లా రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఆయన వైసీపీ నుండి ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీచేసి గెలిచిన జగన్ బాబాయ్, వైసీపీ మాజీ ఎంపీని రాజ్యసభకు లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని తెలుస్తోంది. ఇక టీడీపీ నుండి ఒంగోలు లోక్‌సభకి ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే మంత్రి శిద్ధా రాఘరావుని లోక్‌సభకి పంపి...కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావుని దర్శి నుండి పోటీ చేయించాలని చూస్తున్నారు. అలాగే కనిగిరి నుండి ఇటీవల టీడీపీలో చేరిన ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డిని పోటీ చేయించనున్నారు.


ఈ పార్లమెంట్ స్థానాన్ని పక్కన పెడితే ప్రకాశంలోని 12 అసెంబ్లీ స్థానాలకి అభ్యర్ధులు దాదాపు ఖరారు అయ్యారు. టీడీపీ అభ్యర్ధులు..ఒంగోలు-దామచర్ల జనార్దన్‌, పర్చూరు-ఏలూరి సాంబశివరావు, అద్దంకి-గొట్టిపాటి రవికుమార్‌, చీరాల-కరణం బలరాం, సంతనూతలపాడు-విజయ్‌కుమార్‌, కొండపి- స్వామివెంకయ్య, కందుకూరు- పోతుల రామారావు, ఎర్రగొండపాలెం-పాలపర్తి డేవిడ్‌రాజు, మార్కాపురం-కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు- ముత్తుముల అశోక్‌రెడ్డిలు పోటీ చేయనున్నారు. ఇక దర్శి నుండి శిద్దా రాఘవరావు గాని కదిరి బాబూరావు పోటీ చేయొచ్చు. అటు కనిగిరి నుండి ఉగ్ర నరసింహారెడ్డి దాదాపు ఖరారు అయ్యారు.


వైసీపీ నుండి ఒంగోలు-బాలినేని శ్రీనివాసరెడ్డి, పర్చూరు- దగ్గుబాటి హితేష్‌, అద్దంకి-బాచిన చెంచు గరటయ్య, చీరాల- ఆమంచి కృష్ణమోహన్‌, దర్శి- మద్దిశెట్టి వేణుగోపాల్‌, కందుకూరు - మానుగుంట మహీధర్‌రెడ్డి, కనిగిరి -బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, ఎర్రగొండపుపాలెం-ఆదిమూలపు సురేష్‌, గిద్దలూరు-అన్నా రాంబాబులు పోటీ చేయనున్నారు. సంతనూతలపాడులో వైసీపీ టికెట్ కోసం సుధాకర్‌బాబు, అమృతపాణిలు పోటీ పడుతుండగా, మార్కాపురం కోసం కె.పి. కొండారెడ్డి, జంకె వెంకటరెడ్డిలు పోటీ పడుతున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: