ఈ మద్య కొంత మంది విమానాశ్రయాల్లో చేస్తున్న పనుల వల్ల తోటి ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.  సాధారణంగా మనం ప్రయాణం చేసే సమయంలో అన్ని విషయాల్లో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాం.  ముఖ్యంగా విమాన ప్రయాణాలు చేసేవారు పాస్ పోర్ట్...ఇతర లగేజి విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవడం చూస్తూనే ఉంటాం.  చిన్నపాటి బ్యాగును కూడా మర్చిపోరు. పదేపదే అన్నీ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటారు.
Image result for mother forgot airport her baby
ఇక విమానాశ్రయాల్లో ఏదైనా బ్యాగు మర్చిపోయినా దానిని తిరిగి తీసుకోవడం తలకుమించిన విషయం.  కానీ సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వింత సంఘటన జరిగింది. ఓ తల్లి తన నవజాత శిశువును మర్చిపోయి ఫ్లయిటెక్కేసింది. మార్గమధ్యంలో ఏదో మర్చిపోయినట్టు అనిపించిన ఆమె అసలు విషయం గుర్తొచ్చి షాక్‌కు గురైంది.   వెయింటిగ్ హాల్‌లో తన నవజాత శిశువును వదిలేసి విమానం ఎక్కిన విషయం గుర్తు రావడంతో మైండ్ బ్లాక్ అయ్యింది.   అంతే పెద్ద పెద్దగా కేకలు వేసింది.
Image result for mother forgot airport her baby
విషయం విమాన సిబ్బందికి చెప్పడంతో వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ (ఏటీసీ)కి సమాచారం అందించి..దాంతో తోటి ప్రయాణీకులు షాక్ కి గురయ్యారు. వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులతో మాట్లాడారు..దాంతో  ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. ఆ శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత విమానాన్ని మళ్లీ వెనక్కి రప్పించారు. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. విమానం ల్యాండయ్యాక ఎయిర్‌పోర్టు సిబ్బంది శిశువును ఆమె తల్లికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: