సినీ నటుడు అలీ వైస్సార్సీపీ లోకి చేరే సరికే టీడీపీ అస్సలు తట్టుకోలేకపోతుంది. అందుకే వెంటనే విమర్శలు మొదలుపెట్టింది. ఏ సామాజిక వర్గం వారిపైకి అదే సామాజిక వర్గం వారిని ఉసిగొల్పే చంద్రబాబు.. టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరాతో అలీపై విమర్శలు చేయించారు. అలీని అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ సీట్లో ఆయన ఓటమి తప్పదని సర్వేలో తేలిందని, అందుకే అలీకి నో చెప్పామని అన్నారు నాగుల్ మీరా. తప్పంతా అలీపైకే తోసేశారు. అలీని అసమర్థుడిగా చిత్రీకరించారు.

అలీ .. చంద్రబాబుకు అందుకే చెడింది .. దీనితో జగన్ కు జై ..!

గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున అలీ పోటీ చేస్తారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. ఇటీవల ఓ సభలో అలీని, ఆయన కుటుంబ సభ్యులను సత్కరించిన చంద్రబాబు.. రాజకీయాల్లోకి రావాలని బహిరంగంగానే ఆహ్వానించారు. దీంతో అలీ టీడీపీలో చేరబోతున్నారని, గుంటూరు నుంచి పోటీ చేస్తున్నారనే ప్రచారానికి బలం చేకూరింది. అయితే గెలుపోటములు, పార్టీల బలాబలాలపై పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాతే వైసీపీలో చేరారు అలీ.


అలీ .. చంద్రబాబుకు అందుకే చెడింది .. దీనితో జగన్ కు జై ..!

వాస్తవానికి గుంటూరు ఈస్ట్ నుంచి టీడీపీ అలీకి టికెట్ కన్ఫామ్ చేసింది, కానీ అలీ మాత్రం ఎందుకో వెనక్కితగ్గారు. టికెట్ ఇచ్చినా టీడీపీ తరపున పోటీ చేయడానికి ఆయనకు ధైర్యం సరిపోలేదు. రోజురోజుకీ జగన్ కి పెరుగుతున్న ప్రజాబలం అలీని డైలమాలో పడేసింది. అందుకే ఆయన స్వచ్ఛందంగా టీడీపీ నుంచి దూరంగా వచ్చేశారు. బేషరతుగా జగన్ పక్షాన నిలిచారు. జగన్ తనకు టికెట్ ఇస్తారా ఇవ్వరా అనే విషయం స్పష్టం చేయకపోయినా గెలిచే పార్టీవైపే ఉండాలనే బలమైన నమ్మకంతో ఆయన వైసీపీలో చేరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: