``మ‌నం వాళ్ల‌ను న‌మ్మాం.. అందుకే మోసం చేశారు! మ‌న ఆత్మ‌గౌర‌వాన్ని వాళ్లు భ‌గ్నం చేస్తున్నారు.. అందుకే త‌గిన బుద్ధి చెప్పాలి. నైతికత లేని ప్ర‌భుత్వం ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉంది. మా ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల మాదిరి కొన్నారు``- ఇ వీ క‌ల‌గాపుల‌గం రాజ‌కీయాలు చేసిన ఏపీ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల వ్యాఖ్య‌లు. ఏ పార్టీ ఎప్పుడు ఎటు యూట‌ర్న్ తీసుకుం టుందో..? ఎప్పుడు ఎలాంటి కామెంట్లు చేస్తుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డిన ఏపీలో ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు అద్భుత అవ‌కాశం వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాయ‌కుల‌పైన‌, పార్టీల‌పైనా ఆధార‌ప‌డి.. ఎందుకు ఇలాంటి నాయ‌కుల‌కు ఓట్లేశామ‌ని త‌ల‌లు బాదుకున్న ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు మంచి అవ‌కాశం చిక్కింది. 


కేంద్ర ఎన్నిక‌ల సంఘం న‌గారా మోగించింది. 17వ లోక్‌స‌భ స‌హా తొలి ఏపీ(విభ‌జ‌న త‌ర్వాత జ‌రుగుతున్న రాష్ట్రంలో జ‌రు గుతున్న‌ స్వతంత్ర ఎన్నిక‌లు) ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌న్న‌ద్ధ‌మైంది. ఖ‌చ్చితంగా 29 రోజుల్లో రాష్ట్రానికి ఎలాంటి నాయ‌కు డు రావాలి? ఎలాంటి నాయ‌కుడు కావాలి? అనే విష‌యం తేల్చుకునేందుకు ప్ర‌జ‌ల‌కు అద్భుత అవ‌కాశం వ‌చ్చిన‌ట్ట‌యిం ది. అయితే, ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు కావాల్సింది చాలా దూరదృష్టి. చాలా నిశిత ఆలోచ‌న అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఏదో వేశామంటే వేశామ‌ని అంటే.. మ‌రోసారి గ‌త ఐదేళ్ల ప‌రిస్థితి రాష్ట్రంలో తాండ‌వించ‌క త‌ప్పదు. గ‌త ఎన్నిక‌ల మాదిరిగా కాకుండా ఇప్పుడు రాబోయే ఐదేళ్ల కాలం కూడా ఏపీ ప్ర‌జ‌ల‌కు అగ్ని ప‌రీక్ష వంటిది.


ఏపీకి ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉండే హైద‌రాబాద్ కాల‌ప‌రిమితి ముగిసేది.. రాబోయే ఐదేళ్లలోనే. అదేస‌మ‌యంలో తెలం గాణ రాష్ట్రంలోని ఏపీ ఆస్తుల‌ను రాబ‌ట్టుకునేందుకు ఉన్న గ‌డువు కూడా రాబోయే ఐదేళ్ల కాల‌మే. అయితే, ఈ ఐదేళ్ల కాలంలో నే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల‌ను కూడా రాబ‌ట్టుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌ర్వ‌స‌న్న‌ద్ధంగా ఉండా ల్సిన అవ స‌రం ఉంది. కానీ, దుర‌దృష్ట‌వ శాత్తు.. రాష్ట్రంలో అదికార పార్టీ సొంత లాభం చూసుకుంద‌నే వ్యాఖ్య‌లు విని పిస్తున్నాయి.

ఎలాంటి నైతిక‌త‌ను పాటించ‌కుండానే వైసీపీ ప‌క్షాన గెలిచిన ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేయ డం ప్ర‌జాస్వామ్యా నికి మాయ‌ని మ‌చ్చ‌గా మారిపోయింది. ఇలాంటి ప‌రిస్థితిలో ప్ర‌జ‌లే విజ్ఞులై.. రాబోయే కాలంలో ఏపీని స‌మున్న‌త స్థితికి చేర్చ‌డంతోపాటు హోదా వంటి విష‌యాల‌ను కూడా సాధించ‌గ‌లిగిన నాయకుడిని ఎన్నుకొనాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: